ప్రజావాక్కు
స్థానిక సమస్యలపై ప్రజాగళం

దేశీయోత్పత్తిని పెంచాలి: ఎం.కనకదుర్గ, తెనాలి, గుంటూరు జిల్లా
గత ప్రభుత్వాల ఉదారవైఖరి, సరళ వాణిజ్య, ఆర్థిక విధానాల కారణంగా దేశంలో పెద్ద ఎత్తున విదేశీ వస్తువులు దిగుమతి అయ్యి ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో భాగంగామారాయి. ఇందు వలన లక్షలాది కుటీర,సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలు శాశ్వతంగా మూతబడ్డాయి.
మనదేశీయ కార్మికులు శ్రమించిన వస్తువులకు మార్కెట్ లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో పూజా ద్రవ్యాలు సైతం విదేశీ కంపెనీలవి మార్కెట్‌లో దర్శనమిస్తుం డడం బాధాకరం. నిత్యం ఇంట్లో వినియోగించే వస్తువులలో 70-80 శాతం విదేశీ వస్తువులే కావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నా ఫలితం కానరావడం లేదు.
కాబట్టి ప్రతిఒక్కరూ దేశభక్తి అవలంబించుకొని స్వదేశీ వస్తువులనే వినియోగించేలా శపధం తీసుకోవాలి. దేశీయోత్పత్తి పెరగడం వలన అందరికీ ఉపాధి,ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.
లంచాల నిరోధక చట్టం అమలయ్యేనా?: -యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
ఇందుగలడు,అందులేడు ఎందెందు వెతికినా కాంచగలిగేది అవి నీతి ఊడలే!
ఖజానా, సబ్ రిజిస్టార్, ప్రభుత్వ కార్యాలయాల్లో కాగితంముందుకు జరగాలన్నా,గుత్తేదారు బకాయిలు, అంతెం దుకుసాటిఉద్యోగుల ఐశ్చిక సెలవుకు నగదు,పండుగ భయానా, వేతన సవరణ, గ్రేడ్యూటీ చెల్లింపులు, పదవీ విరమణ చేసిన వారూ చేయి తడపనిదే ఫైలు పైకి కదలని దుస్థితి.
ఎందరో ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నిక కాకముందు, అనంత రంవారి అనుయాయుల,బినామీల ఆస్తిపాస్తులు పరిగణనలోకి తీసుకుంటే ఏరకంగా సంపాదించారో అవగతమవుతోంది.
ఆవు చేలోమేస్తే దూడ గట్టున మేస్తుందా?తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాల ద్వారా వేల కోట్లు అక్రమాలకు పాల్పడే ఈ కాలంలో కఠిన చట్టం విధించినా అది వృధానే.
మౌలిక వసతులు కల్పించాలి: -షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
సెప్టెంబర్ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పాఠశాలలో కొన్ని మౌలిక వసతులు కల్పించా ల్సిన అవసరం ఉంది.
సుమారుగా ఐదు నెలల విరామం తర్వాత పాఠశాలలు ప్రారంభం అవ్ఞతున్న నేపథ్యంలో పాఠ శాల పరిసరాలను పరిశుభ్రంగా, గదులన్నీ బ్లీచింగ్ పౌడర్‌తో, శానిటైజర్‌తో శుభ్రపరచాలి.
ఉపాధ్యాయులకు,ఇతరులకు ఎటు వంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అర్థంకాని ముడిచమురు ధరలు:సింగంపల్లి శేషసాయికుమార్, రాజంపేట
మనదేశంలో ఇంతకు మునుపు ఒకమాసానికో లేక పక్షానికో ఒకసారి పెట్రోలు,డీజిలు,ధరలు పెంచేవారు. అంతలోనే మధ్య లో మరొక్కమారు కొద్దిగా తగ్గించేవారు.
ఇదంతా ఒక తెరిచిన పుస్తకంలా పత్రికలలో పెద్దపెద్ద హెడ్డింగులతో ప్రచురించడంతో ప్రజలందరి నోటిలో నానుతూ ఉండేది. కానీ గత కొంతకాలం గా మాత్రం పరిస్థితి తారుమారు అయిపోయింది.
ఎందుకంటే రోజూ ధరలు సమీక్షించుకొనే అవకాశం చమురు కంపెనీలకు ఇవ్వడంతో రోజుకో రేటు బోర్డుపై మారుతోంది. ఈ ధరలు పెరిగియా? లేక తగ్గయా? అని నిర్ణయించుకొనేలోపు కొండెక్కి కూర్చుకున్నాయి.
ఇప్పుడు సామాన్యులకే కాదు విశ్లేషకులకు సైతం ఇది ఒక వైష్ణవ మాయగా మారింది.
సన్నగిల్లుతున్న క్వాలిటీ: డాక్టర్ .దన్నాన అప్పలనాయుడు, చీపురుపల్లి
చలనచిత్రాలు సమాజ వికాసానికి ఎంతో దోహదం చేస్తాయి. సినిమాలు సర్వకళలతో కూడుకున్న సాధనాలు.
సంగీతం, నటన, నాట్యం, అభినయంతోపాటు సాంకేతిక విలువలను జతకూర్చిన సమగ్రమైన రూపమే సినిమాకళ. ఇట్టి కళా సృష్టికి కథలు ప్రజల నుంచే వస్తాయి.
పూర్వకాలం సినిమాలకు నేటి చిత్రాలకు చాలా తేడా ఉన్నది. వెంటితెరకంటే బుల్లితెర ప్రభావ మెక్కువైంది.నేటిపరిశ్రమ ఎంతోప్రగతి సాధించింది.కాని అప్పు డుఉన్న క్వాలిటీ ఇప్పటి సినిమాలలో చూపెట్టలేకపోతున్నారు.
ప్రతి విషయంలో తొందర ఎక్కువై ఏకాగ్రత నశిస్తున్నది. ఈ పోటీలో గుర్తింపు నకే ప్రాధాన్యమిస్తున్నారు కానీ విలువలకు ప్రాధాన్యమివ్వడం లేదు.
ఇప్పుడు హీరోయిన్‌ఎవరో, క్లబ్ డాన్సర్ ఎవరో క్వాలిటీలో క్లారిటీ రావాలి.
భూబకాసురుల భరతం పట్టాలి: డాక్టర్ ఎం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్
అవినీతి పారద్రోలేందుకు మన ప్రభుత్వ వ్యవస్థ ఎంత సమర్థ వంతంగా, నీతి వంతంగా పనిచేస్తుందో జరుగుతున్న అవినీతి సంఘటనలతో తేటతెల్లమవుతున్నాయి.
రోజురోజుకు అవినీతి తహసీల్దారుల లీలలు బయటపడుతున్నాయి.
వీరందరికి రాజ కీయ నేతల అండదండలు పుష్కలంగా ఉండి, నామమాత్రంగా కొంతకాలం సస్పెన్షన్లలో విశ్రాంత జీవితం గడిపిన తర్వాత తిరిగి విధులలో వీలైతే పదోన్నతితోపాటు మరింత ఎక్కువగా అక్రమార్జన అవకాశాలున్న పోస్టులలో నియమితులు కావడం,..
రిటైర్ అయిన అవినీతి అధికారులపై కేసుల్ని మూసివేయడం, వారు మరణించేవరకు కొనసాగించి తర్వాతతది తరకారణాలతో మూసివేయడం ఒక సుదీర్ఘ ప్రహసనంగా మారింది.
తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/