తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా వ్యాప్తి .. పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేయలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిన్ననే పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేపు జరగాల్సిన పరీక్ష మాత్రం జరుగుతుంది. సోమవారం నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడనున్నాయి. ఈ నెల 29న అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/