విషమంగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం

సైనిక ఆస్పత్రి వర్గాల వెల్లడి

Ex-President Pranab Mukherjee

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఇంకా వెంటిలేటర్‌ పైనే ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రి పేర్కొంది. మెదడు రక్తనాళాల్లో క్లాట్‌ (గడ్డ) ఉండటంతో.. ప్రణబ్‌కు సోమవారం సైనిక ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి మెరుగుదల కనిపించడంలేదని, వైద్య నిపుణుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు శస్త్రచికిత్సకు ముందు నిర్వహించిన పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా నిర్ధారణ అయింది. ప్రణబ్‌ త్వరగా కోలుకోవాలంటూ కేంద్ర మంత్రులు, నేతలు సోమవారం నుంచే తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/