కాల్ లాగ్ లో స్టార్ నటులు !?

సీబీఐ ఆరా!

Rhea
Star actors in Rhea call log!

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ మరణం వెనుక మిస్టరీ ఏమిటా అన్నది ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. అయితే మొదటి నుంచీ మాత్రం సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తి పై అనేక అనుమానాలు నెలకొన్నాయి.

మెల్లగా అవి కాస్తా ఆమెపై మరింత స్థాయిలో బలపడేలా చేశాయి. అయితే ఇప్పుడు ఆమెపై విచారణ మొదలయిన సంగతి అందరికీ తెలిసిందే.

అలా ఇప్పుడు ఆమె కాల్ రికార్డింగ్ డేటా విషయంలో జరిపిన విచారణలో ఆమె పలువురు బాలీవుడ్ స్టార్ నటులు మరియు మన టాలీవుడ్ స్టార్ నటులతో కూడ మాట్లాడినట్టుగా తెలుస్తుంది.

అటు బాలీవుడ్ లో స్టార్ హీరో అమీర్ ఖాన్ మరియు ఆషికి 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్ అలాగే శ్రద్దా కపూర్ తో కూడా ఆమె పలుమార్లు ఫోన్ కాల్స్ మరియు టెక్స్ట్ మెసేజ్ లు చేసుకున్నారట.

మన టాలీవుడ్ కు వస్తే రియా నుంచి రానా కు 7 సార్లు కాల్ వెళ్లగా రానా నుంచి ఆమెకు 4 సార్లు రిటర్న్ కాల్స్ వెళ్లాయట.

అలాగే స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు మధ్య మొదటి నుంచి మంచి బాండింగ్ ఉంది. వీరి ఇద్దరి మధ్య మాత్రం రియా నుంచి రకుల్ కి 30 సార్లు కాల్స్ వెళ్లగా రకుల్ నుంచి 14 సార్లు కాల్స్ వెళ్లాయట.

ఇక మొదటి నుంచి ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి మహేష్ భట్ తో ఈ జనవరి డేటా ప్రకారం ..

రియా మరియు మహేష్ భట్ ల నడుమ మొత్తం 16 సార్లు కాల్స్ రికార్డ్ కాగా అందులో రియా నుంచి 9 సార్లు కాల్స్ వెళ్లగా మహేష్ భట్ నుంచి మొత్తం 7 సార్లు కాల్స్ వెళ్లాయట.

మొత్తానికి మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్ రియా నుంచి సిబిఐ చాలానే అంశాలు రాబట్టేలా ఉన్నాయని అంటున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/