బద్వేలులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

ప‌లువురి విగ్ర‌హాల ఆవిష్క‌ర‌ణ‌

YouTube video
Hon’ble CM of AP will be Laying Foundation Stones for Development Works in Badvel Constituency LIVE

కడప : సీఎం జగన్ క‌డ‌ప జిల్లాలో రెండో రోజు ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా బద్వేలులో ఈ రోజు పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. దాదాపు 400 కోట్ల రూపాయ‌ల‌తో ఈ పనులు చేయ‌నున్నారు. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాలు ముగిసిన త‌ర్వాత బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించనున్నారు. అనంత‌రం ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు చేరుకుని బ్రౌన్‌ విగ్రహాన్ని ఆవిష్క‌రిస్తారు.

అలాగే, బ్రౌన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ త‌ర్వాత‌ కలెక్టరేట్‌ సమీపంలోని మహావీర్‌ సర్కిల్‌ వ‌ద్ద‌ శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనుల‌ను ప్రారంభిస్తారు. వైఎస్‌ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్‌ స్టేడియం వ‌ద్ద కూడా ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయ‌నున్నారు. అలాగే, వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆయ‌న ఆవిష్క‌రిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/