అన్నాడీఎంకేలో అందరినీ ఏకం చేసే పనిలో ఉన్నానుః శశికళ

కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేయనని హామీ

i-need-all-party-members-says-sasikala

చెన్నైః తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై విచారణ జరుగుతున్నప్పటికీ… వాస్తవాలు మాత్రం వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో జయలలిత నెచ్చెలిగా పేరుగాంచిన శశికళ ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. చికిత్స కోసం విదేశాలకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని వైద్యులకు జయలలిత చెప్పారని అన్నారు. చెన్నైలోని కరుణై హౌస్ లో తన మద్దతుదారులతో కలిసి శశికళ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, కేక్ కట్ చేసి నూతన వస్త్రాలను అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నాడీఎంకే పార్టీలోని అందరూ తనకు కావాలని ఆమె చెప్పారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఎవరికీ తాను మద్దతుగా కానీ, వ్యతిరేకంగా కానీ లేనని… అందరూ తనకు కావాల్సిన వాళ్లే అని అన్నారు. పార్టీలో అందరినీ ఏకం చేసే పనిలో తాను ఉన్నానని వెల్లడించారు. తాను ఉన్నంత వరకు పార్టీలో ఏ ఒక్క కార్యకర్త నిరుత్సాహానికి గురికారని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/