పవన్ సినిమా మార్నిగ్ షో కలక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ అంటూ ప్రకాష్ రాజ్ వార్నింగ్

‘మా’ పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడం తో మా లో వేడి ఎక్కువుతుంది. మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా ఎక్కడ తగ్గడం లేదు. ఇరు ప్యానల్స్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా విష్ణు ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్న సీనియర్ నటుడు నరేష్ , అలాగే బాబు మోహన్ లు ప్రకాష్ రాజ్ , పవన్ కళ్యాణ్ ఫై ఘాటైన కామెంట్స్ చేసారు. ఈ క్రమంలో వారికీ ప్రకాష్ రాజ్ వార్నింగ్ ఇచ్చారు.

నేను ఎక్కడ చెప్పని మాటలను కూడా చెప్పానంటూ అబద్దాలు చెప్తున్నారు అని ప్రకాష్ రాజ్ అన్నారు. చిరంజీవి, కృష్ణ గారు అందరి వారు.. వారిని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. అలాగే మా ఎన్నికల్లోకి పవన్ కళ్యాణ్‌ను లాగడం పై కూడా ప్రకాష్ రాజ్ సీరియస్ అయ్యారు. అనవసరంగా ఇందులోకి పవన్‌ను లాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. పవన్ సినిమా మార్నిగ్ షో కలక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మొదట నటుడు.. ఆ తర్వాతే రాజకీయనాయకుడు..అన్నాడు ప్రకాష్ రాజ్.