దేశంలో కొత్త‌గా 1,086 క‌రోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం పట్టాయి. గ‌త కొద్ది రోజుల నుంచి అతి త‌క్కువ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,086 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 71 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 1,198 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 11,871 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 5,21,487 మంది మ‌ర‌ణించారు. డైలీ పాజిటివిటీ రేటు 0.23 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 185.04 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/