హైదరాబాద్‌లో నాలుగు రోజులు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. దక్షిణ మధ్య రైల్వే

నిర్వహణ పనుల కారణంగా రైళ్ల రద్దు

mmts-trains-cancelled-from-14-to-17-in-hyderabad

హైదరాబాద్‌ః హైదరాబాద్ – సికింద్రాబాద్ నగరాల మధ్య సేవలు అందించే 22 ఎంఎంటీస్ రైళ్లను రెండు రోజుల నుండి నాలుగు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో కొన్ని రైళ్లు, 14 నుండి 17 తేదీల మధ్య మరిన్ని రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించింది. 14, 15 తేదీల్లో లింగంపల్లి – హైదరాబాద్ రైళ్లు, 14 వ తేదీ నుండి 17 వరకు ఉందానగర్ – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్ నుమా, రామచంద్రాపురం – ఫలక్ నుమా మార్గాల్లో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది.