రేపటి నుంచి జులై 3 వరకు 36 రైళ్లు రద్దుః దక్షిణ మధ్య రైల్వే

ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే

36-trains-cancelled-in-south-central-zone

హైదరాబాద్‌ః వివిధ కారణాలతో ఇటీవల పలు రైళ్లు రద్దవుతున్నాయి. ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తాజాగా మరో 36 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు తెలిపారు. రేపటి నుంచి జులై 3 వరకు వీటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లను రేపు, ఎల్లుండి, కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను నేడు, 26న రద్దు చేశారు.

కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూరు టౌన్ మధ్య నడిచే రైళ్లను ఎల్లుండి నుంచి జులై 3 వరకు రద్దు చేశారు. కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసెంజర్ రైళ్లను ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వేకు సహకరించాలని కోరారు.