తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ గా ప్రకాష్ జవదేకర్

తెలంగాణ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటీకే పలువురికి కీలక పదవులు అప్పజెప్పిన అధిష్టానం..తాజాగా తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ గా ప్రకాష్ జవదేకర్ ను నియమించారు. ఆయనకు సహాయకుడిగా..కో ఇంచార్జ్ గా.. ప్రస్తుత తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న సునీల్ బన్సల్ వ్యవహరిస్తారు. ప్రకాష్ జవదేకర్ 2014 ఎన్నికల సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో బీజేపీ తరపున కీలకంగా వ్యవహరించారు.

అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ప్రకాష్ జవదేకర్ అంతా తానై వ్యవహరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా వెళ్లారు. పార్టీ పనుల్లో ఇటీవల బిజీగా ఉంటున్నారు. ఎన్నికల టాస్క్ లు నిర్వహించడంలో అపారమైన అనుభవం ఉండటంతో మరోసారి ప్రకాష్ జవదేకర్ ను ఇంచార్జ్ గా తెలంగాణకు నియమించినట్లగా తెలుస్తోంది. రీసెంట్ గా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను తప్పించి , ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అలాగే పార్టీలో చేరి హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ కు ఎన్నికల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. వీరిద్దరి నేతృత్వంలోనే ఎన్నికలు ఎదుర్కోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. మరోపక్క మధ్యప్రదేశ్ కి భూపేంద్ర యాదవ్, చతిస్గఢ్ కు ఓం ప్రకాష్, రాజస్థాన్ కి ప్రహ్లాద్ జోషిని ఎన్నికల ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.