ప్రజావాక్కు: సమస్యలపై గళం

విద్యాసంస్థల్లో ఫీజులను అదుపు చేయాలి: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుంటే ప్రైవేట్‌ రంగంలో మాత్రం దినదినాభివృద్ధిచెందుతోంది. విద్యాసంవత్సరం పూర్తికాకుండా నే వచ్చే సంవత్సరం కోసం అభ్యసన ప్రక్రియ జోరందుకుం ది. ప్రతి సంవత్పరం ఫీజులు, ఇతర సుంకాలను దాదాపు 25 శాతం పెంచుతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవ్ఞతున్నాయి. ఇప్పటికే పెరిగిన ఫీజుల భారం మోయలేని తల్లిదండ్రులు చేస్తున్న విజ్ఞప్తులు బుట్ట దాఖలు అవ్ఞతున్నాయి. లొసుగుల కారణంగా ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తున్నాయి. గ్రామా ల్లోసైతం ఫీజులదోపిడీ జోరందుకుంది.ఫీజులను నియంత్రించే విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

పాలకుల అసత్య ప్రచారాలు: -గోపాలుని శ్రీరామమూర్తి, గుంటూరుజిల్లా

భారతదేశం 70 సంవత్సరాలనుంచి అభివృద్ధి క్షీణిస్తూనే ఉంది. ఏమి అభివృద్ధి జరగలేదు. గాంధీ, నెహ్రూలు కానీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర పార్టీలు ప్రభుత్వాలు కానీ ఏమి చేయలేదు. మేము మాత్రమే ఈ దేశాన్ని 10, 15 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని అంటూ ప్రస్తుత పార్టీల నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలివ్వటం సమజంసమేనా. ఇటువంటి స్వార్థపరులు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

తల్లులకు ఏమిటి ఈ శిక్ష?: -పారేపల్లి సత్యనారాయణ, దేవులపల్లి, ప.గోజిల్లా

ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదు వ్ఞతున్న అర్హులైన విద్యార్థులకు వారి తల్లుల అకౌంట్లో ‘అమ్మ ఒడి పథకం కింద 15వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాఠశాల ల్లో మరుగుదొడ్లు నిర్వహణకు తల్లులు అందరిని వెయ్యి రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు ఇమ్మని విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనే వెయ్యి రూపాయలు జమ చేయమనడం, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు మిన హాయింపు ఇవ్వడం పేద తల్లులకు మింగుడుపడటం లేదు. అందరికీ సమానంగా జమచేసినప్పుడు అందరి వద్ద నుంచి వెయ్యి రూపాయలు తీసుకోవాలి. కానీ పేదల నుంచే డబ్బులు తీసుకోవడం సమంజసంకాదు.

ప్లాస్టిక్‌ను పారేద్దాం:-సయ్యద్‌ షఫీ, హన్మకొండ

మన పూర్వీకులు ప్రకృతివనరులతో తయారు చేసిన వస్తువ్ఞ లను ఉపయోగించేవారు. నేటి ఆధునిక యుగంలో ప్రజలు ప్లాస్టిక్‌ వస్తువ్ఞల మోజులో పడ్డారు. ఈ రోజు మనం కూర్చునే కుర్చీ నుండి తినే ఆహార పాత్రల వరకు ప్లాస్టిక్‌ వాడుతున్నాం. ప్లాస్టిక్‌ వస్తువ్ఞలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వాడడం, పారేయడానికి అలవాటు పడిన ప్రజలు మట్టితో చేసిన వస్తువ్ఞలు వాడటానికి ఇష్టపడటం లేదు. ప్లాస్టిక్‌ మనకే కాదు భూమిని కూడా పాడుచేస్తుంది. వాడిపారేసిన ప్లాస్టిక్‌ మట్టిలో కలవకపోగా అలాగే ఉండి పంటలు పండకుండా చేస్తా యి. చెరువ్ఞలు కాలువలు జలాశయాలు కలుషితం అవడంతో అందులోని జీవరాశులు చనిపోతున్నాయి.ప్లాస్టిక్‌ను కాల్చడం వల్ల విషవాయువ్ఞలు విడుదలై జీవకోటికి ముప్పు జరుగు తుంది. కాబట్టి ప్లాస్టిక్‌ను నివారిద్దాం.

సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: -బి.సురేష్‌, అరసవిల్లి, ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శపాఠశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ టీచర్లు అనేక సమస్యలతో సతమతమవ్ఞతున్నారు. ఆదర్శపాఠశాలల వ్యవస్థపై విధాన నిర్ణయం ప్రకటించాలని అనేక మార్లు చేసిన విజ్ఞప్తులను పరిశీలించి న్యాయం చేయాలి. ఈ ఆదర్శపాఠ శాలల సిబ్బందికి ఒఐఒ పద్దులో జీతాలు చెల్లించి, అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేందుకు తగు ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమ లుకు నోచుకోవడం లేదు.సర్వీసు నిబంధనలు, కారుణ్య నియా మకాలు, పెన్షన్‌ స్కీమ్‌ కాంట్రిబ్యూషన్‌, ఆరోగ్య శ్రీ, ఉద్యోగ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌,సాధారణ ఉద్యోగులకు వర్తించే ఏ సౌకర్యం లేకపోవడం వలన అభద్రతాభావంతో ఉన్నారు. రెగ్యులర్‌ సిబ్బంది అయినప్పటికీ కొన్ని సాంకేతిక సమస్యల వలన ఉద్యోగులు నష్టపోతున్నారు.

నిరసనలు చేయడం భావ్యంకాదు:-కె.రామారావు విశాఖపట్నం

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి పరిసరాల్లోని 29 గ్రామాల రైతులు చేపడుతున్న నిరసనలు, పని,పాట వదు లుకొని టిడిపి ఇస్తున్న సొమ్మును వాడుకుంటూ నిరసనలు చేయడం పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాజధానికోసం ఏమీ చేయకుండా కేవలంభూము లను మాత్రమే లాక్కొని రియల్‌ఎస్టేట్‌ను నిర్వహించడంతో అక్కడి భూముల ధరలు అమాంతంగా పెరి గాయి. ఇప్పుడు మూడు రాజధానులు అనేసరికి వాటి ధరలు ఎక్కడపడిపో తాయోనని కొందరునిరసనలను ప్రోత్సహిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/