కాంగ్రెస్‌కు యువనాయకత్వం అవసరం!

పార్టీని పునర్వ్యవస్థీకరించాలి

Congress party
Congress party


ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా బలమైన ప్రతిపక్షపార్టీ ఉంటేనే అన్నీ సజావ్ఞగా నడుస్తాయి. ఏకపార్టీ ఆధిపత్య ప్రభుత్వాలు ఏవీ కాలం గడిచిన తరువాత పుంజుకోవడంఅరుదు. మెక్సికో, అర్జెంటీనా, సౌత్‌ ఆఫ్రికాలో ఒకే పార్టీ ఆధిపత్యాలు సాగక కొత్త పార్టీలు ఏర్పడి అధికారాన్ని చేజిక్కించుకొన్నాయి. ఇండియాలో కూడా 56 సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా పాలించిన పార్టీయైన కాంగ్రెస్‌ తన సొంత తప్పిదాలతో 1980లో ప్రతిపక్ష కూటమికి అవకాశం ఇచ్చింది.

దానితో ఎన్డీయే కూటమి ఆధిపత్య పార్టీయైన బిజెపి అధికారాన్ని 1988,1989,1990లో అధికారానికి వచ్చింది. దానితో కాంగ్రెస్‌ నాయకత్వాన యుపిఏ కూటమి ఏర్పడి 2004లో అధికారానికి వచ్చింది. కాంగ్రెస్‌ అధినాయకత్వానికి ముందుచూపులేక, వారసత్వ నాయకత్వం చచ్చుపడిపోవడంతో 2014లో ఎన్డీయే పుజుకొంది. అధికారం బిజెపి నాయకత్వాన ఏర్పడింది. 2019లో కూడా కాంగ్రెస్‌ నాయకత్వాన 18 పార్టీల యుపిఏ కూటమి కోలుకోలేకపోవడం బిజెపి సొంతంగా అధికారానికి వచ్చింది.

ఈ నేపథ్యంలో 140 సంవత్సరాలు ప్రాబల్యం, అధికారం చెలాయించిన కాంగ్రెస్‌ పార్టీ నాలుగో తరం నాయకత్వానికి దిశ, దశ, నిర్దేశనం చేసే పటిష్ట మైన నాయకత్వం లేక గాంధీ, నెహ్రూ కుటుంబం ఆధిపత్యాన్ని కోల్పోయింది. అందుకు నాలుగోతరం నాయకుడు రాహుల్‌గాంధీకి ప్రజల మద్దతు కరవైంది.అంతేగాక కాంగ్రెస్‌ పార్టీ, ప్రాంతీయపార్టీ నాయకులను నమ్మి తన సత్తాను, బలాన్ని నిరూపించుకోలేకపోవ డంతో రైట్‌వింగ్‌ పార్టీయైన బిజెపి దేశ భద్రత, జాతీయ సమగ్ర తలే కాకుండా పాకిస్థాన్‌ అనే భూతాన్ని చూపి అధికారానికి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం కేవలం డజన్‌ రాష్ట్రాలలో తన అధికారాన్ని పరిమితం చేయడమే కాక 2019లో 54 ఎంపి సీట్లతో ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా కోల్పోయింది. అందుకు కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధమే.

కాంగ్రెస్‌ నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, లేదా గాంధీ,నెహ్రూ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కొత్త నీరు రాకతో పాత నీరు వదిలిపోతుంది. ఇక్కడ గాంధీ, నెహ్రూ కుటుంబం లేకుండా అసలు కాంగ్రెస్‌ మనుగడే కష్టంగా పరిణమించింది. కాంగ్రెస్‌లోనే అంతర్గత మార్పుల కోసం కష్టపడుతూ కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి పార్టీ సమావేశాలు జరిపి నాయకులను ఎంచుకోవడం, రాష్ట్రాల అధ్యక్షుల నియామకం చేయడంలో తత్సారం చేస్తూ నమ్ముకున్న నాయకులను కూడా ఆయారాష్ట్రాలలోను, ప్రాంతీ యంగా కోల్పోతుంది. కిందిస్థాయిలో కాంగ్రెస్‌ను నమ్ముకొని పని చేస్తున్న కేడర్‌కు కానీ,కార్యకర్తలకు కానీ మేమున్నాం అని భరోసా నిచ్చే నాయకులు కరవైనారు.

అంతేగాక అధికార పార్టీ కాంగ్రెస్‌ నాయకులపై సిబిఐ దాడులు, ఇడి దాడులు చేయించడంతో అటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీలోనో ఇటు ప్రాంతీయంగా అధికా రంలో ఉన్న పార్టీలలోనో కాంగ్రెస్‌ నాయకులు చేరి తమను తాము కాపాడుకొనే స్థితికి దిగజారుతున్నారు. ఇందుకు కారణం కేంద్ర కార్యవర్గ కాంగ్రెస్‌ నాయకత్వపు చలనం లేని తనంతో కాంగ్రెస్‌తో మొదటి నుండి అంటిపెట్టుకొన్నవారు పార్టీని విడిచి పోయే స్థితికి తెస్తున్నారు. ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారికి కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలను అప్పగించడంతో కాంగ్రెస్‌ పార్టీ అధికారం ఆమడదూరంగానే మిగిలిపోతుంది. రాష్ట్రాలలో పరిస్థితులను బేరీజు వేసుకొని ప్రజాదరణ ఉండి ఉత్సాహంతో పనిచేసే నాయకులను అనాలోచితంగా కాంగ్రెస్‌ పార్టీ వదులుకోవడంతో కిందిస్థాయి కాంగ్రెస్‌ మద్దతు దారులు అయోమయస్థితిలో పార్టీకి పనిచేయలేక కృంగిపోతున్నారు.

అంతేగాక వృద్ధనాయకులు,పైరవీ కారుల మాటలునమ్మి నిజమైన నాయకులను కాంగ్రెస్‌ కోల్పోతుం ది. కాంగ్రెస్‌ పార్టీలో వృద్ధనాయకత్వం పదవ్ఞలు పట్టుకొని వేలా డుతూ పార్టీకి చెడు చేస్తున్నారు. ఇంకా కాంగ్రెస్‌ పార్టీ సిడబ్ల్యూసి నాయకులు నేలవిడిచి సాముచేస్తున్న చందంగావ్యవహరిస్తున్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వం వలన పార్టీకి చావ్ఞదెబ్బ తగిలింది.

సిడబ్ల్యుసిలో ప్రజల మద్దతు లేనివారే అధికంగా ఉన్నారు. వారి పదవ్ఞలు పట్టుకొని వేలాడుతూ కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసే నిర్ణయాల వల్ల వారి సీటు భద్రంగా ఉంచుకుంటున్నారు. కాంగ్రెస్‌పార్టీలో యువనాయకత్వం, పరిస్థితులను బట్టి స్పందించే వారు కావాలి.వృద్ధ, యువనాయకుల కాంబినేషన్‌ పనిచేయకపోవ డంతో మధ్యప్రదేశ్‌లో అధికారానికి దూరమైంది.

అటు పార్లమెంటు లోనూ, ఇటు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ ధీటైన కార్యక్రమంతో ముందుకుపోవడంలేదు. కాంగ్రెస్‌ కేడర్‌ ఉత్తేజపరిచి బైఎలక్షన్స్‌ లోనూ, ఆరు రాష్ట్రాల ఎన్నికలలోనూ చురుకైన చర్యలతో సత్తాను చాటుకోవాలి. పడిపోతున్నవారి మద్దతును కాంగ్రెస్‌ పార్టీ అంది పుచ్చుకోవాలి.

కాంగ్రెస్‌ సొంతంగా లేక ప్రాంతీయ పార్టీలతో మెలు కువగా వ్యవహరించాలి. హర్యానాలో నిర్ణయం ఆలస్యంతో అధి కారంలో భాగంపంచుకొనే స్థితిని కాంగ్రెస్‌ పోగొట్టుకుంది. వాస్తవిక దృక్పథంతో నాయకులకు మద్దతునిస్తూ కేంద్రం సిడబ్ల్యుసి త్వరితంగా నిర్ణయాలు చేయలేకపోవడంతో అధికారానికి దూరమవుతుంది. గోవా, మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీ జాగరూకతతో నిర్ణయం చేయకపోవడం శాపంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీని పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పునర్‌వ్యవస్థీ కరించాలి. గెలిచే గెలుపుగుర్రాలను ఒడిసిపట్టుకొని కాంగ్రెస్‌ పార్టీని పరుగెత్తించాలి.

కాంగ్రెస్‌ అధినాయకత్వం చురుకైన ప్రతిపక్షంగా కేంద్రంలోనూ ఆయారాష్ట్రాల యూనిట్‌లను పనిచేయించాలి.నేటికీ కాంగ్రెస్‌పార్టీకి 24శాతం నుండి 28శాతంవరకు ఓట్ల మద్దతుంది. దానికి తోడుగా ఒక పదిశాతం నూతన యువత సెక్యులర్‌, తటస్థ ఓటర్లను ఆకర్షించి ప్రతిచోట అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్‌పార్టీ ప్రతి స్థాయిలోనూ పటిష్టంగా పనిచేయాలి.

  • డాక్టర్‌ ఆసయ్య, ఐఐఎస్‌