రైతుబాటే నిర్మలమ్మ మాట

రైతులకు సంబంధించిన ఏ హామీనైనా చిత్తశుద్ధితో అమలు చేయాలన్నా కేంద్రం, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం, సహకారం ఉండాలి. ఏదైనా పథకం ప్రవేశపెట్టే దశలోనే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ముందుగా రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర పెంపుపైనే కేంద్రం దృష్టి నిలపాలన్నది అందరి మాట. వీటంన్నిటితో పాటు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు మొదట వ్యవసాయ సంస్కరణలు తీసుకురావాలని నిపుణులు వక్కాణిస్తున్నారు.

AGRICULTURE

నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం మూలంగా నూతనంగా బడ్జెట్‌ సమర్పణలో కేంద్ర ఆర్థిక మంత్రి ఆచితూచి అడుగులేశారు. కొత్త పథకాల జోలి కెళ్లి వ్యయాన్ని పెంచడం, రుణ భారాన్ని మరింత నెత్తికెత్తుకోకుండా జాగ్రత్తపడ్డారు. ఆదాయానికి, వ్యయానికి మధ్య పొంతన కుద రడం లేదన్నది వాస్తమే.

ఈ దఫా బడ్జెట్లో వ్యవసాయం, గ్రామీ ణాభివృద్ధి రంగాలకు భారీగా కేటాయింపులు జరపడం నిజంగా శుభసూచకమే.ఏతావాతా నిర్మలత్వాన్ని చాటుకుంటూ సీతారామన్‌ ఇరకాట పరిస్థితి నుంచి గట్టెక్కారు.ప్రజల ఆదాయాన్ని, కొనుగోలు శక్తినిపెంచడమే ధ్యేయంగా బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. పొదుపు కన్నా ఖర్చు చేయండంటూ మీ వ్యయమే ఆర్థిక మాంద్యానికి మందంటూ కొత్త పల్లవిని అందుకున్నారు.బడ్జెట్‌ లాభమా,నష్టమా అనేది అనుభవపూర్వకంగా కానీ తెలిసిరావేమో! బడ్జెట్‌ ఆర్థిక గమ నాన్ని నిర్దేశించే కొలమానిగా భావించే ప్రక్రియ.ప్రతిఏటా అందరికి వినిపించే ఆర్థిక పలుకులపై అందరికీ ఆసక్తే. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ సమర్పణలో ఎన్నో కొత్త కొత్త అంశాల ఆవిష్కరణ, పథ గమనాన్ని నిర్దేశించాయి.

‘నిర్మల హృదయ సీతారామన్‌ ఈ బడ్జెట్‌ సమర్పణలో ఎంతో కసరత్తు చేశారు. సుదీర్ఘ సమయంలో సరికొత్త ఆలోచనలను బయటపెట్టారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా వెలుగొందుతున్న దశలో దేశానికి ఉపయుక్తమైన సాగు-సాయంపైనే బడ్జెట్‌ రచన సాగిందని చెప్పకతప్పదు. మేరా కర్షక్‌ మహాన్‌, హమారా ప్రధాన్‌ రైతు ఆద్మీ తరహాలో రైతే రాజన్న సందేశాన్నిచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌. వ్యవసాయాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. రైతులకోసం 16 సూత్రాల కార్యాచరణ ప్రణాళికలను వల్లే వేశారు.

రైతుల ఆదా యాన్ని రెట్టింపు చేసేందుకు మనస్సు పెట్టారు. వ్యవసాయం, నీటి పారుదల, సాగు అనుబంధరంగాలపైనే రూ.1.60 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌కు మరో 1.23 లక్షల కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటీవల పెరుగు తున్న సోలార్‌ వినియోగాన్ని గుర్తించి ఆ రంగంలో విద్యుదు త్పత్తిని పెంచేందుకు ప్రోత్సహించాలని సంకల్పించింది. చాలా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోని రైతులు తమ బీడు భూముల్లో సోలార్‌ ప్లాంట్లు పెట్టేందుకు సాయపడాలని నిర్ణయించడం గొప్ప ఆలో చనగా అభివర్ణిస్తున్నారు. ఇదే సమయంలో 100 కరవ్ఞ పీడిత జిల్లాల్లో సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేయడం ముదావహం. అలాగే రైతుల్ని పట్టిపీడిస్తున్న వ్యవసాయ రుణలక్ష్యాన్ని 15 లక్షల కోట్లకు పెంచారు.

ఇటీవల కాలంలో ధరల దండయాత్ర మనకు ఎరుకే. ఇబ్బడిముబ్బడిగా నిత్యావసరాల ధరలు సెగపెడుతున్న ఈ వేళ ఆహార ధరల అదుపునకు స్థిరీకరణ నిధి ఆలోచనలతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఉల్లి, టమోటా లాంటి ఆహార ధర లను అదుపులో ఉంచడానికే ఈధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికే దిగుమతి సుంకం, కనీస మద్దతు ధర, ఎగుమతి పరిమితులు, నిల్వలపై పరిమితులు తీసుకురావడంతోపాటు రాష్ట్రాలు కూడా బ్లాక్‌ మార్కెట్‌ను కట్టడి చేయాలని సూచించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉంటే రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలేవి బడ్జెట్‌లో ప్రతిపాదించలేదనే విమర్శలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవ సాయం (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌) చేసే రైతులను ప్రోత్సహించడంతో పాటు పైసా ఖర్చులేకుండా ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని (జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) ప్రోత్సహిస్తామని చెప్పారు.దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జిడిపి) వృద్ధిరేటు గత 12 ఏళ్లలో ఎప్పుడూ లేని కనిష్ట స్థాయికి ఐదుశాతానికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందులో వ్యవసాయ ఆధారిత రంగాల వృద్ధిరేటు కేవలం 2.8 శాతానికి పరిమితమైనప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయ డం సాధ్యమేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కౌలుదారులకు లాభం చేకూరలేదు. కౌలుదారులను లెక్కించేందుకు దేశంలో ఇంతవరకు నిర్దిష్టంగా ఏ కసరత్తు జరగలేదు. 2018 లోనూ, ఆ తర్వాత సరైన మద్దతు ధరలు లభించక దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేశారు. గత ఏడాది చివర్లో ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి నగరాల్లో రైతులు భారీ ప్రదర్శనలకు దిగారు.అంతేకాక ఏడాదికేడాది రైతుల ఆత్మహత్యలు, పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు సంబంధించిన ఏ హామీనైనా చిత్తశుద్ధితో అమలు చేయాలన్నా కేంద్రం, రాష్ట్రాల మధ్య సరైన సమన్వయం సహకారం ఉండాలి.

ఏదైనా పథకం ప్రవేశపెట్టే దశలోనే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ముందు గా రైతులకు గిట్టుబాటు ధర, మద్దతు ధర పెంపుపైనే కేంద్రం దృష్టి నిలపాలన్నది అందరి మాట. వీటంన్నిటితో పాటు స్వామి నాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు మొదట వ్యవసాయ సంస్కర ణలు తీసుకురావాలని నిపుణులు వక్కాణిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సర్వత్రా యువతపైనే అందరి దృష్టి నిలుస్తోంది.

నానాటికీ పెరిగిపోతున్న విద్యా ఉత్తీర్ణులకు మేలు చేకూర్చే అంశాలపై బడ్జెట్‌లో ప్రాధాన్యత నివ్వడం పేర్కొనదగి నదే.దేశంలో విద్యావ్యవస్థను సంస్కరించేదిశగా త్వరలోనే నూతన విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. ఉన్నత విద్య, అభ్యసించే వారికోసం పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ కోర్సు ను అందుబాటులోకి తేవాలనుకోవడం హర్షించదగినదే. విద్యా రంగానికి 99,300 కోట్లు, వృత్తి విద్యా శిక్షణ నైపుణ్యాలకు మూడువేల కోట్లు ఇవ్వడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ఆకర్షించేలా చర్యలను ఆర్థిక మంత్రి చెప్పుకొచ్చారు.

అయితే నడుస్తున్న చరిత్రలో ఉపాధి, నైపుణ్యాల మెరుగుకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఉంటున్న తరుణంలో తక్కువ మొత్తాన్ని కేటాయించ డం గమనార్హం.విశ్వవ్యాప్తంగా భారత్‌లోనూ ఆరోగ్యం, ప్రాథమిక అవసరంగా పేర్కొనబడుతోంది. ఆయా దేశాలు జిడిపిలో ఆరోగ్య రంగంపై వెచ్చిస్తున్న శాతాలను పరిశీలిస్తే భారత్‌లోనే అతి తక్కు వగా 1.28శాతంగా ఉంది.అదే అమెరికాలో 17.15 శాతం ఉంది. బ్రిటన్‌, చైనా, పాకిస్థాన్‌ కన్నా భారత్‌లోనే తక్కువగా ఉంటోంది. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి పెద్దపీట వేస్తూరూ.69 వేల కోట్లు కేటాయిపు ప్రత్యేకించదగినదే. 2019-2020 బడ్జెట్‌ కన్నా అదనంగా 10 శాతం పెంచుతూ నయం చేసే వ్యాధుల సంఖ్యను కూడా 12కు పెంచుతూ, కొత్తగా ఐదు వ్యాధులకు చోటు కల్పించారు.

పన్నులు ఇబ్బడిముబ్బడిగా వసూలైతేనే ఏపని చేపట్టినా పురోగమించేందుకు అవకాశమేర్పడుతుంది.2019-20లో పన్నుల రాబడి 22.4 లక్షల కోట్లయితే అంతకుపూర్వం 2018- 19లో పన్నుల ఆదాయం 24.6లక్షల కోట్లుగా 15వ ఆర్థిక సంఘ మే సెలవిచ్చింది. దీన్నిబట్టి 2.2 లక్షల కోట్లు ఆదాయం తగ్గినట్లే. పన్నుల వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సమన్వయం అత్యంత అవశ్యకమైంది.15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు కొన్ని రాష్ట్రాలకు నష్టమే కలిగించాయి. పన్నుల వాటాలో రాష్ట్రాలకు రావాల్సిన దాంట్లో కోత విధించడం అందరూ గమనించాల్సిన అంశమే.

2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం, 1971 జనాభా లెక్కల్లోని సంతానోత్పత్తి రేటును కలపడం లాంటి గందరగోళాల మధ్యముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్ట్టంజరిగింది.రాష్ట్రాలకు పన్నుల వాటా కేంద్రం భరించాల్సిన దానిలో 42 శాతం బదులు 41 శాతం అయింది. దరిమిలా రాష్ట్రాలకు పన్నుల వాటా తగ్గి, ఆయా రాష్ట్రాల ఆర్థికస్థితిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఏ రాష్ట్రమైనా ప్రస్తుత ఖర్చును ప్రస్తుత ఆదా యం నుంచే చేయాల్సి ఉంది. అప్పుడే రెవెన్యూలోటు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.అయితే ఈశాన్యరాష్ట్రాలు దీనికి దూరమవ్వ డంతో ఆ రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఆర్థిక సంఘం నిధులి స్తోంది.

ఈ జాబితా 14 రాష్ట్రాలకు పెరిగింది. 2020-2021లో రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నులవాటాను ఆర్థికసంఘం 8.55,178 కోట్లుగా పేర్కొంటుండగా బడ్జెట్‌లో మాత్రం 7,84,180 కోట్లుగా ప్రతిపాదించారు. స్థూలంగా 2020-2021లో 70,996 కోట్లు తక్కువగా రాష్ట్రాలకు పన్నుల వాటా దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాలతోపాటు కర్ణాటక, కేరళ, అసోం లాంటి రాష్ట్రాలకే ఈ నష్టం కలుగుతుందని ఆర్థిక నిపుణులు నొక్కి చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల ఆర్థికస్థితిగతులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండొ చ్చని, ఆర్థిక ఒడిదుడుకుల మధ్య సతమతమవ్ఞతున్న ఆంధ్రప్రదేశ్‌ పైనే కేంద్ర పన్నుల వాటా తగ్గింపు ప్రతికూలతను చోటు చేస్తుం దని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పెద్దనోట్ల రద్దు, మాంద్యం పూర్వరంగంలో బడ్జెట్‌ గణాంకాలను స్థూలంగా పరిశీలిస్తే స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల 12శాతంగా ఉంటుందని అంచనా వేస్తే 19-20లోజిడిపి పెరుగుదల 8.5శాతమే రికార్డుఅయింది.2020- 2021ఆర్థిక సంవత్సరానికి జిడిపి పెరుగుదల అంచనా10శాతంగా ఉంది.ద్రవ్యలోటు అంచనా3.3శాతం కాగా 2020-21లో ద్రవ్యలోటును 3.5 శాతంగా ఉంచాలని ప్రతిపాదించారు.

-చెన్నుపాటి రామారావు,

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/