మరింత స్వయంసమృద్ధ భారత్‌ నిర్మాణం

కోవిడ్-19 మహమ్మారి విజృంభణ కాలంలో కేంద్ర ప్రభుత్వం 4 విధానాలు

A more self-sufficient India
A more self-sufficient India

ప్రధానమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వ నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ కోవిడ్-19 మహమ్మారిని దీటుగా ఎదుర్కొంది.

(1) చక్కని క్రమబద్దత కలిగిన దశల వారీ విధానం అనుసరించడం (2) కఠినమైన లాక్‌డౌన్‌ అమలు పరిచి క్రమంగా దాన్ని తొలగించడం (3) తీవ్రంగా బాదితులైన వర్గాలకు తక్షణ భారీ సహాయం అందిం చడం (4) ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరిట భవిష్యత్‌కు అవసరమైన వైఖరితో అంతర్జాతీయ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం.

అస్థిరత అధికంగా ఉన్న సమయంలో క్రమబద్ధతతోకూడి దశలవారీ విధానం ప్రస్తుత పరిస్థితుల్లో కీలకం.

కొవిడ్‌-19 మహమ్మారి విజృంభణ కాలంలో ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం నిలకడగా ఈ విధానం అనుసరించింది.

జాన్‌ భీ ఔర్‌ భీ -జీవితాలు, జీవనాధారాలు ప్రస్తుత కొవిడ్‌-19 మహమ్మారి దీటుగా ఎదుర్కొనే వ్యూహంలో ప్రధానమంత్రి మోడీ రెండు ప్రాధ్యాతలు ఇవే. ఆరు నెలలుగా ప్రపంచాన్ని కుదిపివేస్తున్న మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేం దుకు ప్రతి ఒక్క దేశం ఈ రెండింటి మధ్య సమతూకం సాధిం చేందుకు ప్రయత్నిస్తోంది.

కొన్ని దేశాలు దానితోనే సహజీవనం సాగించే వ్యూహంతో సాగుతుండగా కొన్ని దేశాలు మాత్రం తీవ్రంగా పోరాడుతున్నాయి. కొన్ని దేశాలు మాత్రమే ఈ సంక్షో భం విషయంలో సమర్థవంతమైన చర్యలు తీసుకోగలుగుతున్నా యన్న విస్తృత ఏకాభిప్రాయం కనిపిస్తోంది.

ఇలాంటి దేశాల్లో భారత్‌ ఒకటి. భారతదేశం ఎక్కువ శాతం అధిక జనాభా, జన సాంద్రత ఉన్న దిగువ మధ్యాదాయ దేశం.

ఎంతో అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలున్న సంపన్న దేశాలు కూడా విఫ లమవ్ఞతూ ఉండగా భారత్‌ మాత్రం ఏ విధంగా విజయం సాధిం చగలుగుతోంది అన్నది ప్రశ్న ప్రధానమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వ నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఈ మహమ్మారిని దీటుగా ఎదుర్కొంది.

దేశంలో కేసుల సంఖ్య కేవలం 536 ఉన్న సమయంలోనే ముందస్తుంగా దానిపై సర్జికల్‌ స్ట్రైక్‌ ప్రారంభించింది. లాక్‌డౌన్‌ సమసర్థవంతంగా పని చేసిందని రుజువ్ఞ కావడంతోపాటు చికిత్సలు కూడా అందుబాటు లోకి వసున్నాయన్న సంకతాలు రావడంతో లాక్‌డౌన్‌ క్రమంగా ఎత్తివేస్తోంది.

ఆర్థిక వ్యవస్థ విషయంలో కూడా ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అదే తరహా దశలవారీ వ్యూహం అనుసరిస్తున్నారు.

తదుపరి దశలో క్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తి వేసే వ్యూహం అనుసరించడం రెండో చర్య, మార్చి 25వ తేదీన లాక్‌ డౌన్‌ ప్రకటించే నాటికి రోజువారీ కేసుల పెరుగుదల రేటు 16 శాతం ఉండేది. అదే తీరులో వ్యాధి వ్యాపించి ఉంటే ఈ సమ యానికి మన దేశంలో కేసుల సంఖ్య 4 మిలియన్‌కు సమీపంలో ఉండేది.

కాని ఇప్పుడు దేశంలో కేసుల సంఖ్య 1,18,000 మాత్రమే. మెరుగైన చికిత్స, రోగనివారణ కోసం ఎదురు చూసేం దుకు లాక్‌డౌన్‌ మనకి విలువైన సమయం ఇచ్చింది. ఆ రకంగా లక్షలాది ప్రాణాలు కాపాడగలిగామని చరిత్ర తప్పనిసరిగా నిరూపి స్తుంది.

ప్రధానంగా లాక్‌డౌన్‌ మనం సమర్ధవంతంగా తయార య్యేందుకు సహాయకారి అయింది. 1.36 బిలియన్‌ జనాభాను భౌతిక దూరం పాటించడం, తరచు చేతులు కడుక్కోవడం, ముఖాన్ని కప్పి ఉంచేలా ఫేస్‌ కవర్స్‌ వినియోగంపై చైతన్య వంతులను చేయగలిగాం. వైద్య సదుపాయాలు కూడా వేగంగా విస్తరించాయి.

ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాలోనూ ఐసొలేషన్‌ వార్డులు, పిపిఇ కిట్లు, సుశిక్షితులైన వైద్య సిబ్బంది, వెంటిలే టర్లు, ఆక్సిజెన్‌ ట్రీట్‌ మెంట్‌ అందుబాటులో ఉన్నాయి. అవసర మైనన్ని మందులు, వైద్య సరఫరాలు, పిపిఇ కిట్లను నిల్వ చేసు కున్నాం.

మన ఇంజనీర్లు భరించగల ధరల్లో వెంటిలేటర్లు తయా రుచేసి అందించగా మన శాస్త్రవేత్తలు భారీ పరిమాణంలో వ్యాక్సి న్లు, ఔషధాలు ఉత్పత్తి చేసేందుకు సమాయత్తంగా ఉన్నారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేత కూడా సహకార ఫెడరలిజం స్ఫూర్తిని సమర్థవంతగా ప్రదర్శిస్తోంది.

ప్రతీ ఒక్క రాష్ట్రం కూడా అత్యంత కఠినంగా కట్టటి చర్యలు అమలుపరిచిన జోన్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన టి3 వైఖరి (టెస్ట్‌, ట్రీట్‌, ట్రాక్‌) అమలుపరు స్తోంది. సరఫరా వ్యవస్థలన్నింటిలోనూ కార్యకలాపాల జోరు మరోసారి ప్రారంభమయింది. ఫ్యాక్టరీలు, దుకాణాలు తిరిగి తెరుచుకుంటున్నాయి.

ఆఫీసులు ఉద్యోగులతో నిండుతున్నాయి. వ్యాపారాల్లో డెలివరీ సర్వీసులు పునఃప్రారంభమవ్ఞతున్నాయి. రైళ్లు, విమానాలు, ట్రక్కులు, బస్సులు తగు రక్షణలతో తిరిగి ప్రారంభమవ్ఞతున్నాయి.

జీవితాలు కాపాడడంతోపాటు జీవనో పాధిపై కూడా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. మోడీ ప్రభుత్వం కరోనా కారణంగా తీవ్రంగా బాధితులైన వర్గాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించింది.

లాక్‌డౌన్‌ ప్రారంభమైన కొద్ది రోజులకే ఆర్థిక, ఆచరణ, ద్రవ్య పరమైన చర్యల మిశ్రమంగా తొలి సహాయ ప్యాకేజిని ప్రకటించింది. పట్టణ పేదలకు పిడిఎన్‌ దుకాణాల ద్వారా ఆహార భద్రత కల్పించడంతో పాటు జన్‌ధన్‌, పించను ఖాతాల ద్వారా నగదు చెల్లింపులు కూడా చేస్తున్నారు.

రైతు చేతికి అందిన పంటకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకున్నారు.

గత 60 రోజుల కాలం లో సగటున 9 కోట్ల రైతు కుటుంబాలకు రూ. 12వేల కోట్లు నగదు నేరుగా ఖాతాల్లో జమ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు డిబిటి పథకాల ద్వారా మరింత నగదు అందిం చాయి. సగటు రేటును రూ.202కి పెంచారు.

ఆ పథకానికి నిధులు 65 శాంత పైగా పెంచి రూ.లక్ష కోట్ల మేరకు చేర్చారు.

ఎంఎస్‌ఎంఇ రంగానికి రూ.3లక్షల కోట్ల మేరకు ఎలాంటి హామీలు లేకుండానే తోణ రుణసదుపాయం అందించారు. వలస కార్మికలు తిరుగు ప్రయాణాల్లో పలువ్ఞరు మరణించారు.

మే12వ తేదీన ప్రధానమంత్రి మరింత స్వయంసమృద్ధ భారత నిర్మాణం లక్ష్యంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రణాళిక ప్రకటించారు.

పలు ఇతర దేశాలు ఇప్పటికి ఆ మహమ్మరిని అదుపు చేసేందుకు పోరాటం చేస్తుండగా మోడీ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని శక్తివంత మైన సంస్కరణతో పురోగమించగల భారత దేశంగా మలచేందుకు కృషి చేపట్టింది.

ఇందుకు అనుగుణంగా ఆర్థికమంత్రి మే 13 నుంచి 167 తేదీల మధ్యలో ఐదు విడతలుగా పలు ప్యాకేజీలు ఆవిష్కరించారు.

వ్యవసాయంపై నియంత్రణలు పూర్తిగా ఎత్తి వేశారు. వ్యవసాయదారులు ఇప్పుడు స్వేచ్ఛగా తమ ఉత్పత్తులు విక్రయించుకోవచ్చు.

బొగ్గు, గనులు, రక్షణ ఉత్పత్తుల రంగాల పరిశ్రమల్లోకి ప్రైవేటు పెట్టుడులు రావడానికి మార్గం సుగమనం చేశారు. ఒక జాబ్‌, ఒకే రేషన్‌ కార్డు విధానం ద్వారా జాతీయ స్థాయి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.

వ్యూహాత్మకం కాని రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు మరింత వేగంగా చేపట్టబోతున్నారు.

కంపెనీల దివాలా చర్యలకు కొక సంవత్సరం విరామం ఇచ్చారు. డిస్కమ్‌లను పట్టిషం చేయడా నికి, భద్‌చతా వ్యవస్థల అమలుకు రాష్ట్రాలకు మరిన్ని నిధులు అందుతున్నాయి.

ఆరోగ్య రక్షణపై కూడా వ్యయం అసాధారణంగా పెంచారు. కొద్ది కాలంలో ప్రకటించిన పలు సంస్కరణల్లో ఇవి కొన్ని మాత్రమే.

కొవిడ్‌-19 మహమ్మారి కనీసం రానున్న రెండేళ్ల పాటు మనతోనే ఉంటుంది. పలుదేశాలు ఈ మహమ్మారికి తీవ్రంగా దెబ్బ తిన్నందువల్ల కోవిడ్‌ అనంతర ప్రపంచం పూర్తి భిన్నంగా ఉంటుంది.

ప్రధానమంత్రి మోడీ ఈ చరిత్రను మరింత స్వయంసమృద్ధమైన భారత్‌ నిర్మాణానికి ఒక అవకాశంగా మార్చా రు.

జీవితాలు, జీవనోపాధి రెండింటినీ భారత్‌ రక్షించగలుగు తుంది. మరింత శక్తివంతమైన, స్వయంసమృద్ధ భారత్‌ ఎంతో ఆశతో భవిష్యత్‌లోకి తొంగి చూస్తోంది.

రచయిత: -జయంత్‌ సిన్హా, పార్లమెంటు ఆర్థికస్థాయి సంఘం చైర్మన్‌

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/