ప్రజావాక్కు

సామాజిక సమస్యలపై ప్రజాగళం

Voice of the people
Voice of the people

కేంద్ర ప్రతిపాదన హర్షణీయం:-యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

ఐదో తరగతి వరకు ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అమ లు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడం హర్షనీయం. విద్య వ్యాపారంగా మారి ప్రైవేట్‌ సంస్థలు పుట్టగొడుగుల్లా విస్తరించి ఆంగ్లభాషను బలవంతంగా రుద్దడంతో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆర్టీసీ బస్సుపై గల ఊరు పేర్లు చదవలేని దయనీయస్థితిలో ఉన్నారు. కాన్వెంట్‌లో తెలుగు పలికితే కొంత మంది సిబ్బంది దండించడం చూస్తున్నాం. మరికొంత కాలం ఇదే రీతిన కొనసాగితే తెలుగు అంతరించిపోయే ప్రమా దముంది. ఇప్పటికే ఆంగ్లం అమలుకు కట్టుబడి ఉన్నామని విద్యాశాఖమాత్యులు ప్రకటించడం మరో వివాదానికి తెరలే పుతున్నట్టుంది. ప్రతిష్టకు పోకుండా మాతృభాషపై కేంద్ర ప్రతిపాదనను యధాతథంగా అమలు చేయాలి.

ఉపాధిహామీ పనులు ఎఫ్‌.ఎలకు ఇవ్వాలి:-శ్రీనివాస్‌ చిరిపోతుల, వెంకటేశ్వరపల్లి, భూపాలపల్లి

గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్వహించే వివిధ రకాల పనులను గ్రామాల్లో ఉండే ఎఫ్‌.ఎ (ఫీల్డ్‌ అసిస్టెంట్‌)లకే తిరిగి బాధ్యతలు అప్పగించాలి.గత కొన్నినెలలకిందట వీరిని ఉపాధి హామీనుండి తొలగించి పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసి స్టెంట్లు గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరిని వివిధకారణాలను సాకుగా చూపి పక్కన పెట్టడం సమం జసంకాదు. ఎఫ్‌.ఏలను విధులనుండి తొల గించి పంచాయతీ కార్యదర్శులకుబాధ్యతలు అప్పటించడంతోవారుఉపాధి కోల్పో యి కుటుంబపోషణ భారంగా మారిన పరిస్థితి.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7500 మంది ఎఫ్‌.ఏలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలి.

కబ్జాకు గురవుతున్న దేవాదాయ భూములు:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

కొవిడ్‌-19 కారణంగా మార్చి రెండో వారంలో పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి. వచ్చే అక్టోబరు, నవంబర్‌ నాటికి కూడా అవి తిరిగి తెరుచుకునే పరిస్థితులు కనబడడం లేదు. పాఠశాలలు మూతపడగానే ప్రైవేట్‌ విద్యాసంస్థలు టీచర్లనుతగ్గించేశాయి.ఉన్నవారికికూడాసక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌ విద్య పేరిట తరగతులను కలిపివేసి తక్కువ సిబ్బందితో తరగతులను నిర్వహిస్తున్నారు. భావిభారత పౌరులకు నాణ్యమైన విద్య అందించి వారిని తీర్చిదిద్దాల్సిన టీచర్లు ఇప్పుడు జీతాల కోసం, ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.

డాక్టర్లు దయ చూపాలి:-దన్నాన అప్పలనాయుడు, పార్వతీపురం

కరోనా మహమ్మారి విజృంభణ తగ్గడంలేదు. వేలకువేలు పాజి టివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. క్వారంటైన్లలో వైద్యంతో జాగ్రత్తలు తీసుకోవడంతో నెగిటివ్‌ కేసులుగా మారి మరల డిశ్చార్జ్‌ అవ్ఞతూనే ఉన్నారు.వెళ్తున్నారు. వస్తున్నారు. మధ్యలో చనిపోయినవారెవరు? ఇతర అనారోగ్యకారణాలు ఉన్నవారు. వారువైద్యులే కానీ,ఎంత గొప్ప ధనవంతులవ్వనీ వ్యాధి సోకిన వారు బలికాక తప్పడం లేదు. ముఖ్యంగా భయమనే భూతం ముందే ఆవహించి మానసికంగా బలహీనపరుస్తుంది. ఇతర ఎమర్జెన్సీ వ్యాధుల కారణాల వలన ఎవరైనా హాస్పిటల్‌కు వెళితే హాస్పిటల్‌ వారు కరోనా ఉన్నదీ లేనిది రిపోర్టులు చూపమంటున్నారు. అప్పటికప్పుడు రిపోర్టులు ఎలా వస్తాయి. ఆస్పత్రి వర్గాలు మానవతా దృక్పథంతో జాగ్రత్తలు తీసుకుం టూ పేషెంట్స్‌ను అడ్మిట్‌ చేసుకోని ఆదుకోవాలి.

మాతృభాషలోనే విద్యాబోధన: -సయ్యద్‌ షఫీ, హన్మకొండ

తల్లి నుండిబిడ్డ నేర్చుకునే భాషనే అమ్మభాష అంటారు. ఐదేళ్ల ప్రాయం గల విద్యార్థికి మాతృభాషలోనే విద్యాభ్యాసం ప్రారం భించడం మన సంప్రదాయం. ప్రపంచ భాష అయిన ఇంగ్లీషు విశ్వవ్యాప్తం కావడం మనం అందరికి తెలిసిందే. కేంద్రప్రభు త్వం ప్రాథమిక స్థాయి వరకు విద్యను అమ్మభాషలోనే బోధిం చాలని ఆదేశించడం సంతోషదాయం. మాతృభాషలో భావవ్య క్తీకరణ సులభం అగును.ఎక్కువ శ్రద్ధతో నేర్చుకునే అవకాశం, సంభాషణ విషయ విశ్లేషణ చేయడం తేలిక. జ్ఞానార్జన అవగాహన మూర్తిమత్వ వికాసాలకు మాతృభాష బోధన తోడ్ప డుతుంది.మాతృభాషలో విద్యాబోధన చేయడం విద్యార్థులకు చదువ్ఞపై ఆసక్తి పెరుగుతుంది. ఏదిఏమైనప్పటికిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మభాష అమలుపై శ్రద్ధ పెట్టాలి.

ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలి: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కొవిడ్‌-19 కారణంగా మార్చి రెండో వారంలో పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి.వచ్చేఅక్టోబరు,నవంబర్‌ నాటికి కూడా అవి తిరిగి తెరుచుకునే పరిస్థితులు కనబడడం లేదు. పాఠశాలలు మూతపడగానే ప్రైవేట్‌ విద్యాసంస్థలు టీచర్ల నుతగ్గించేశాయి.ఉన్నవారికి కూడాసక్రమంగా జీతాలు చెల్లించడంలేదు. ఏప్రిల్‌నెలలో ఆన్‌లైన్‌ విద్య పేరిట తరగ తులను కలిపివేసి తక్కువ సిబ్బందితో తరగతులను నిర్వ హిస్తున్నారు.నాణ్యమైన విద్యఅందించి పౌరులను తీర్చిది ద్దాల్సిన టీచర్లుఇప్పుడు ఉపాధికోసం ఎదురుచూస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/