ప్రజారోగ్యంపై కొరవడిన ప్రణాళికలు

PATIENTS in Hospitals

డెబ్భై సంవత్సరాల భారత దేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్న తరుణంలో ప్రజా రోగ్యవ్యవస్థ రోజురోజుకు గాడి తప్పుతూ సామాన్య మానవ్ఞనికి నాణ్యమైన వైద్యం అందని ద్రాక్ష గానే మిగిలిందనేది చేదు నిజం. నేడు శాస్త్ర సాంకేతిక రంగాలను అందిపుచ్చుకుని వైద్యరంగం ముందుకు వెళుతూ విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతున్న సందర్భంలో భారతదేశ గ్రామీణ ప్రాథమిక వైద్యరంగం నేటికీ మౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయ డానికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అనేక ప్రజా రోగ్య పథకాలు ఆశించిన రీతిలో అమలుకు నోచుకోక పునాది స్థాయిలోనే వైఫల్యం చెంది ప్రజారోగ్య వ్యవస్థకు పెను సవా లుగా మారాయి. తద్వారా సామాన్య ప్రజలు రోజువారీ జీవితం లో ఎదుర్కొంటున్న అనేక ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్‌, ప్రైవేట్‌, ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేక సామా జికంగా, ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటూ రోడ్డునపడు తున్నారు.

ప్రస్తుతం రోజురోజుకు విజృంభిస్తున్న కాలుష్యం, పరిసరాల అపరిశుభ్రత, పౌష్టికాహారలోపం, కల్తీ, ఆహార పదార్థాలు, అవగాహన లేమితో భారత్‌లో పలు రకాల వ్యాధుల ముప్పు పొంచి ఉందని అనేక ఆరోగ్య సర్వేలు హెచ్చరిస్తున్నా యి. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, ఆసాంక్రమిక వ్యాధులు, వినూత్నమైన బాక్టీరియా, వైరస్‌ సంబంధిత వ్యాధుల బెడద తీవ్ర రూపాన్ని దాల్చుతున్న వేళ వాటి కట్టడికై నేటికీ సమగ్ర మైన శాస్త్రీయ ప్రజారోగ్య విధానం లేకపోవడం బాధాకరం. ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు లేని వైద్యవిద్య, వైద్య కళా శాలలు, లోపభూయిష్టమైన వైద్య విధానం, ప్రైవేట్‌ వైద్యశాల లలో జరుగుతున్న దోపిడీ, ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వస తులు లేమి, చుక్కలనంటుతున్న మందుల ధరలు ప్రజారోగ్య వ్యవస్థను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి.

ఈ తరుణంలో ప్రజా రోగ్య వ్యవస్థ బలోపేతానికై ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కంటితుడుపుగానే మిగులుతూ దశలవారీగా ప్రజారోగ్యం వ్యవస్థ నుంచి ప్రభుత్వాలు తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగు తుందనేది నిర్వివాదాంశంగా చెప్పవచ్చు. ప్రజలందరికీ నాణ్య మైన ఉచిత వైద్యాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన ప్రజారోగ్య పథకాలను, వైద్యవిద్యలో సంస్కరణలు, వైద్యవిధానాన్ని, ఔషధ ధరల నియంత్రణ, కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వహణను పునఃసమీక్షించి అందరికీ నాణ్యమైన ఆరోగ్యం సేవలు అందేలా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

కావ్ఞన ప్రభుత్వాలు ప్రజల భాగస్వామ్యంతో పటిష్టమైన ఆరోగ్య ప్రణాళికలు, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, జిల్లా ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులను కల్పిస్తూ ప్రభుత్వ వైద్యసేవలపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించేటట్లు కృషి చేయాలి. వైద్యబృందాల ద్వారా ప్రజారోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాలానుగుణ వ్యాధులు, జీవనశైలి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడాలి. అంతేకాకుండా ప్రజారోగ్య వ్యవస్థలో అతి ప్రాముఖ్యత గల అంశం నిధులు. కావ్ఞన ప్రతియేటా ప్రభుత్వాలు బడ్జెట్లో ఆరోగ్య రంగానికి సరిపడా నిధులు కేటాయిస్తూ ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి.

  • సంపతి రమేష్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/