ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Voice of the People
Voice of the People

ఔనిధులు ఆపేయడం మంచిదికాదు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా హఠాత్తుగా నిధులు కేటా యింపు నిలుపు చేయడం అహేతుకం. ప్రపంచమంతా కరోనా రక్కసి తాకిడికి విలవిల్లాడుతున్నవేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న కుంటిసాకులతో నిధులు ఆపివేయడం మరింత సంక్షోభాన్ని సృష్టించినట్లయింది.

ప్రపంచంలో అన్ని దేశాల మధ్య తగు సమన్వయంతో అత్యవసర మందులు, టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్ల కొరత లేకుండా కరోనాను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు మార్గ దర్శకాలనువిడుదల చేయడంలో కరోనాను నిరోధించే వ్యాక్సి న్‌ తయారీలో వివిధ దేశాల మధ్య సమన్వయాన్ని సాధిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరు శ్లాఘనీయం.

సమన్వయకర్త పాత్రలో నిధులు అవసరం ఎంతో ఉంటుంది. కుంటిసాకులు, తప్పుడు ఆరోపణలతో ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులు ఆపేసి, ఆ సంస్థ పనితీరుకు విఘాతం కలిగించే నిర్ణయాన్ని అమెరికా వెంటనే వెనక్కి తీసుకోవాలి.

వైద్యులకు రక్షణ కల్పించండి:-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీలైన ప్రతిసారీ వైద్యుల గొప్పదనం గురించి మాట్లాడుతున్నాయి.

కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో లాక్‌డౌన్‌ సమయంలో పోరు ముందు వరుసులో ఉన్న వైద్యులు, ప్రజారోగ్య సిబ్బంది, పోలీసుల గురించి గొప్పగా మాట్లాడుతున్నాయి.

అయితే కార్యక్షేత్రంలో మాత్రం చేసిన పనికి గుర్తింపు మాట దేవ్ఞడెరుగు. సరైన రక్షణ కూడా లేనట్టు తెలుస్తోంది.వైద్యులపై ప్రజారోగ్య సిబ్బం దిపై రోగులు,రోగుల బంధువ్ఞల దాడుల వార్తలు వినిపిస్తు న్నాయి.

ప్రభుత్వంకఠినంగా వ్యవహరించకపోతే దేశం తీవ్రంగా నష్టపోతుంది. వైద్యులకు, ప్రజారోగ్య సిబ్బందికి బీమా కల్పించడం కన్నా,వృత్తి ధైర్యంగా చేసుకొనే ధీమా కల్పించడం అత్యవసరం. ప్రభుత్వాలు వెంటనే చేయాల్సిన పని.

సమస్యల వలయంలో పథకాలు: -కె.సతీష్‌రెడ్డి, వరంగల్‌

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మెనూ ప్రకారం ప్రతీ విద్యార్థికి వంద గ్రామలు బియ్యం, ప్రాథమికోన్నత, ఉన్న త పాఠశాల విద్యార్థులకు నూటయాభై గ్రాముల బియ్యా న్ని అందిస్తున్నారు.

పెరిగే విద్యార్థులకు ప్రభుత్వం అందిం చే తక్కువ గ్రాముల బియ్యంతో ఆకలి తీరలేక ఇంటినుండి అదనంగా తెచ్చుకుని తినే పరిస్థితులు ఏర్పడ్డాయి.

లాక్‌డౌన్‌ సదా పాటించాలి:-యర్రమోతు ధర్మరాజు,ధవళేశ్వరం

కిటకిటలాడుతూ తిరగే రైళ్లు బస్సులు, తినడానికి ఎగబడే హోటళ్లు, పబ్‌లు,రెస్టారెంట్లు, ఐస్‌క్రీం పార్లర్లు, మిఠాయి దుకా ణాలు, సినిమాథియేటర్లు, మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, బ్యూటీ పార్లర్లు, మాంసం దుకాణాలు, పెళ్లిళ్లు పేరంటాలు, సభలు, సమావేశాలు, వివిధకేసులతో పోలీసు స్టేషన్లు న్యాయస్థానాలు, ఇలా రోజూ లక్షలాది మంది ప్రజలు తిరుగాడే ప్రాంతాలన్నీ బోసిపోయాయి.

అయినా ఎవరికీ ఏ ఆటంకం లేదు. రోజులు యధాతథంగా జరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసినా అంద రూ ఇలాగే దినచర్యలు పాటిస్తే దుబారా అదుపు చేయడంతోపాటు ఆరోగ్యాన్ని దేశాన్ని కాపాడుకోవచ్చు.

ఇంటింటి సర్వే జరగడం లేదు: -గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

ముఖ్యమంత్రి పది రోజుల క్రితం ప్రకటించిన ఇంటింటికీ మూడో సర్వే జరుగుతున్న దాఖలాలు లేవ్ఞ. నిజానికి అసలు మొదటి రెండు సర్వేలు కూడా జరిగినట్లు ఎక్కడా ధృవపరచిన వారే లేరు.

ఇప్పుడు వలంటీర్లు చాలాప్రాంతాల్లో గైరుహాజరు అవ్ఞతున్నారనీ మరలా వారిని నియమించడానికి కసరత్తులు చేస్తున్నట్లు చెబుతున్నారు. అసలు ఆ సర్వే లక్ష్యం ఏమిటి? పాలకులు ఏ విషయంపైనా ఖచ్చితమైన సమాచారం కూడా ఇవ్వలేకపోవడం చాలా విచాకరం.

రైతులు, కూలీలు, చేతివృ త్తుల వారు, మోటారు, భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం! ప్రజలకు ఉపశమనం కల్పించాలన్న చిత్తశుద్ధి పాలకుల్లో ఉందా?

అన్ని రకాల చెల్లింపులు వాయిదా:-బాపట్ల రామపుల్లారావు, విజయవాడ

చైనా కరోనా వ్యాధి ప్రపంచాన్ని భయంకరంగా అతలా కుతలం చేస్తున్నది. మనదేశంలోనూ అదే పరిస్థితి. ఆ వ్యాధి వ్యాప్తి నిరోధానికి మనదేశమంతటా లాక్‌డౌన్‌ ప్రక టించడం జరిగింది.ప్రభుత్వ,ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠ శాలలు ఈన్న మూసివేశారు.

అవకాశమున్న సంస్థలు, ఇంటి నుంచి పని కొనసాగిస్తున్నాయి. చాలా ప్రైవేట్‌ కంపె నీలు, కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత మందికి మాత్రమే నెల జీతాలు అందాయి.

ప్రభుత్వాలు సైతం తమ ఉద్యోగులకు జీతాలు కోతలు పెట్టాయి.కనుక ప్రస్తుత అత్యవసర పరిస్థితులలో ప్రజలకు కొంత వెలుసుబాటు, ఊరట కలిగించేంఉకు ఈ వాయిదా చెల్లింపులన్నింటినీ వాయిదా వేయాలి.

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/