మృత్యువు ముంగిట …

The dead front ..
The dead front ..

మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల నివారణకు గాను నిర్భయ చట్టాన్ని తెచ్చినప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పురాలేదు. అమ్మాయిలపై ఆకృత్యాలలో తగ్గుదల లేదు. రికార్డులు చూస్తే ఇంకా పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధికశాతం అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి. 2018లో రోజుకు సగటున 91 అత్యాచారాలు జరిగాయని, మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఇవి 59.3 శాతంగా ఉన్నాయని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సిఆర్‌బి) తాజాగా వెల్లడించింది. న్యాయచట్టాల్లోని కొన్ని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి దోషులు అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న కారణంగా సుదీర్ఘకాలం పాటు విచారణలు కొనసాగుతున్నాయి. నిర్భయ నిందితులు ఇటువంటి లొసుగులను ఉపయోగించే ఏడేళ్ల నుండి ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు.

ని స్సహాయస్థితిలో ఉన్న నిర్భయపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హత్య చేసిన మానవ మృగాలకు అంతిమ సమయం ఆసన్నమైంది. ఏడు సంవత్సరాల సుదీర్ఘనిరీక్షణ అనంతరం ఎట్టకేలకు నిర్భయ హంత కులకు చావ్ఞ గడియలు దగ్గరపడ్డాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకేసులో నలుగురు దోషులకు మొదటగా జనవరి 7వ తేదీన డెత్‌వారెంట్‌ జారీ అయింది. జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్‌ జైలులో చనిపోయేవరకు దోషులైన ముఖేష్‌, పవన్‌గుప్త, విన§్‌ు శర్మ, అక్ష§్‌ు కుమార్‌లను ఉరితీయాలని పాటియాలా హౌస్‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు అనంతరం నిర్భయపై అఘా యిత్యానికి ఒడిగట్టిన దోషులు పెట్టుకున్న క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయడంతో దోషులకు అవకాశాలు సన్నగిల్లిపోయా యి. నలుగురు నిందితుల్లో ఒకడైన ముఖేష్‌కుమార్‌సింగ్‌ రాష్ట్ర పతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోవడంతో ఈ నెల 22న అమలు చేయాల్సిన ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు నిలిపివేసింది.

క్షమాభిక్ష పిటిషన్‌ ను రాష్ట్రపతి జనవరి 17న తిరస్కరించడం జరిగింది. కారాగార నిబంధనల ప్రకారం క్షమాభిక్ష పిటిషన్‌ తేదీకి మరణశిక్ష అమలు తేదీకి మధ్య 14 రోజుల సమయం ఉండాలి. దీంతో మరోసారి ఢిల్లీ సెషన్స్‌కోర్టు నిందితులను ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంట లకు ఉరితీయాలని డెత్‌వారెంట్లు జారీ చేసింది. పారామెడికల్‌ విద్యార్థి నిర్భయను 2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి ఢిల్లీ వీధుల్లో కదులుతున్న బస్సులో అతిపాశవికంగా అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచి బస్సులో నుంచి రోడ్డుపై పడేశారు. సమా చారం అందుకున్న పోలీసులు బాధితురాలిని ఢిల్లీలోని సప్థర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేర్చారు. డిసెంబరు 26వ తేదీన బాధితురాలి ఆరో గ్యం విషమించి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురికావడంతో అప్పటి ప్రభు త్వం సింగపూర్‌కు తరలించి మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో చేర్పిం చింది.

అయినా ఫలితం లేక బాధితురాలు 2012 డిసెంబరు 29న తుదిశ్వాస విడిచింది. పోలీసులు ఆ ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. నిర్భయ మరణం ఆనాడు దేశాన్ని మొత్తం కన్నీరు పెట్టించింది. దేశం నలుమూలల నుంచి దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు, ర్యాలీలు కొనసాగాయి. ఢిల్లీ వేదికగా పెద్దఎత్తున నిర్భయ హంతకులను తుదముట్టించాలని పోరాటం కొనసాగింది. ఈ ఉద్యమాన్ని ప్రధానంగా యువత ముందుండి నడిపించింది.

వివిధ విశ్వవిద్యాలయాల, కళాశాలల నుండి వేలసంఖ్యలో వచ్చిన విద్యార్థులు ఇండియాగేట్‌, రాష్ట్రపతిభవన్‌ వద్ద తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. ప్రజల ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం మహిళలపై వేధింపులు, అత్యాచారాల నిరోధానికి నిర్భయచట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నిర్భయచట్టాన్ని 2013 మార్చి 19న లోక్‌సభ, మార్చి21న రాజ్యసభ ఆమోదిం చింది. ఏప్రిల్‌ 2న రాష్ట్రపతి ఆమోదం పొందింది.

నిర్భయ కేసు విచారణకు గాను 2013 జనవరి 2న ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టును సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.కేసు విచారణ లో ఉండగానే తీహార్‌జైలులో ఆరుగురు నిందితుల్లో ఒకడైన రాంసింగ్‌ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మైనర్‌ బాలుడికి మూడేళ్ల శిక్షను జువైనల్‌ జస్టిస్‌బోర్డు విధించింది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2013 సెప్టెంబర్‌ 13న నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది. నిందితులు ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు విచారణ చేసి 2014 మార్చి 13న ఉరిశిక్షను ఖరారు చేసింది.

దోషులు మరల సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో శిక్షఅమలుపై స్టే విధించింది. సుదీర్ఘంగా విచా రణ చేసిన సుప్రీంకోర్టు 2017 మే 5న హైకోర్టు తీర్పును ఖరారు చేసి నిందితులు నలుగురిని ఉరితీయాలని తీర్పు చెప్పింది. మరల నిందితులు సుప్రీంలో రివ్యూపిటిషన్‌ దాఖలుచేశారు. 2018 జులై 9న నిందితుల రివ్యూపిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 2019 ఫిబ్రవరిలో నిందితులకు వెంటనే డెత్‌వారెంట్లు జారీ చేయాలంటూ ఢిల్లీ కోర్టును నిర్భయ తల్లిదండ్రులు ఆశ్రయించారు.

జనవరి 7న పాటియాలా హౌస్‌ కోర్టు నిందితులు నలుగురిని తీహార్‌ జైలులో జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరితీయాలంటూ డెత్‌వారెంట్లు జారీ చేసింది. మరల నిందితులు సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం, రాష్ట్రపతికి క్షమాభిక్షకు పిటిషన్‌ పెట్టుకోవడం వాటిని సుప్రీంకోర్టు, రాష్ట్రపతి తిరస్క రించడం తదితర కారణాలతో తాజాగా డెత్‌వారెంట్లుజారీ అయ్యా యి. ఉరితీసే తేదీ ఫిబ్రవరి 1కి మారింది. మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల నివారణకుగాను నిర్భయ చట్టాన్ని తెచ్చిన ప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పురాలేదు. అమ్మాయిలపై ఆకృత్యాలలో తగ్గుదల లేదు.రికార్డులు చూస్తే ఇంకా పెరిగిపోతు న్నాయి.

నేరగాళ్లు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాల్లో అధికశాతం అత్యాచారాలకు సంబంధించినవే ఉంటున్నాయి. 2018లో రోజుకు సగటున 91 అత్యాచారాలు జరిగాయని, మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఇవి 59.3 శాతంగా ఉన్నాయని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సి ఆర్‌బి) తాజాగా వెల్లడించింది.న్యాయచట్టాల్లోని కొన్ని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి దోషులు అనేకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న కారణంగా సుదీర్ఘకాలం పాటు విచారణలు కొనసాగుతున్నాయి.

నిర్భయ నిందితులు ఇటువంటి లొసుగులను ఉపయోగించే ఏడేళ్ల నుండి ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలుగుతు న్నారు. గత 15ఏళ్లలో మరణదండన విధించిన కేసుల్లో కేవలం ఒక్కశాతం మందినే ఉరితీసినట్టు జాతీయ నేర రికార్డుల బ్యూరో, మానవ హక్కుల ఆసియా కేంద్రం (ఎసిహెచ్‌ఆర్‌) గణాంకాలు తెలి యచేస్తున్నాయి.2018 డిసెంబర్‌వరకు దేశంలో మరణశిక్షను ఎదు ర్కొంటున్నవారు 400మంది వరకు ఉంటే గత 15ఏళ్లలో కేవలం నలుగురికే ఉరిశిక్ష అమలు చేశారు.త్వరితగతిన కేసుల విచారణకు గాను అడ్డొచ్చే న్యాయచట్టాలలోని నియమ నిబంధనలను ప్రభు త్వం తక్షణమే సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/