కలవరపెడుతున్న కేన్సర్‌

నేడు ప్రపంచ కేన్సర్‌ దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వయసు, ప్రాంతం లాంటి బేధాలు లేకుండా క్యాన్సర్‌ వ్యాధి బారినపడుతున్నారు. సామా న్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది ఈ వ్యాధిబారినపడి ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ సంస్థలు, ఎన్జీవోలు, స్వచ్ఛంద సంస్థలు వ్యాధి లక్షణాలపై ప్రచారం చేసి, వ్యాధికి గురైనవారికి సరైన చర్యల ద్వారా వ్యాధి నివారణ సాధ్యమన్నది చెప్పాలన్న లక్ష్యం తో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌నివారణ కార్యక్రమాలు, అవగా హన కార్యక్రమాలు, ర్యాలీలు, సదస్సులు,నిర్వహించడం ద్వారా ప్రజల్లో చైతన్యం అంతర్జాతీయ క్యాన్సర్‌ నివారణ సంస్థ సూచ నలను, ప్రచార కార్యక్రమాలను, పాంప్లెట్లను ప్రజలకు అందిం చడంద్వారా ప్రచారకార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.

ఇంటర్నేషనల్‌ క్యాన్సర్‌ కంట్రోల్‌చే (యుఐసిసి) స్థాపించబడ్డ ఫిబ్రవరి నాలుగున ప్రతి సంవత్సరం క్యాన్సర్‌ వ్యాధికి వ్యతిరే కంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది.ఈ క్యాన్సర్‌ వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి అవగా హనకల్పించి చికిత్సను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దే శ్యం.ప్రతి సంవత్సరం ఒక థీమ్‌ను తీసుకొనిప్రచార కార్యక్రమా లు నిర్వహిస్తారు. ఈ ఏడాది ‘అయామ్‌ అండ్‌ ఐవిల్‌ అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మన శరీరంలో కణ విభజన అనేది నిరంతరం జరిగేప్రక్రియ.అయితే ఇది అన్ని భాగా లలో జరగదు.మన శరీరంలో కన్ను మెదడు గుండె మూత్రపిండా లు వంటి ప్రత్యేక క్రియల కోసం ఏర్పడ్డ అవయవాలు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటా యో జీవితాంతం కూడా అదే విధంగా ఉంటా యి. వీటిలో కణ విభజన జరగదు. అయితే వయసుతో పాటు వీటిని సంఖ్య తగ్గుతుంది కానీ పెరగదు. మరి కొన్ని కణాలు అవసరాన్నిబట్టి పుడుతూ చనిపోతూ ఉంటాయి. ఎర్రరక్తకణాలు తెల్ల రక్తకణాలు నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి.

వాటి జీవితకాలం అయిపోగానే అవి చనిపోయి వాటి స్థానంలో కొత్త కణాలు వచ్చిచేరుతూ ఉంటాయి. కొన్నిసార్లు కణంలో జన్యువ్ఞలలో వచ్చే మార్పులవల్ల ఒకటిలేక కొన్ని పనికి రాని కణాలు ఒక పద్ధతి ప్రకారం కాకుండా నిరంతరం విభజన చెందుతూ ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తూ వాటి అవా సాలను ఆక్రమిస్తూ చుట్టూఉన్న కణాలను మొత్తం ఆక్రమిస్తాయి. వీటికి మరణం లేకుండా నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి. ఫలితంగా చుట్టుపక్కల ఉన్నకణాలు వాటి విధులు నిర్వర్తించక జీవక్రియలు తగ్గిపోయి క్రమంగా మనిషిమరణానికి దగ్గర వ్ఞతాడు.క్యాన్సర్‌ కణాలు ఒక భాగంలో పుట్టి అక్కడే ఉండవచ్చు లేదా రక్తనాళాల ద్వారా ఒక చోటి నుండి మరో చోటికి వ్యాపించి మిగతా కణాలను నాశనం చేస్తాయి.

అనువంశికంగా వచ్చే జన్యువ్ఞలు 10శాతం క్యాన్సర్‌లకు కారణమతే మిగిలిన 90శాతానికి మన జీవనశైలే కారణం. ఆహారపు అల వాట్లతోపాటు వాతావరణ కాలుష్యానికి అతినీల లోహిత కిరణా లకు హానికర రసాయనాలు విషపదార్థాల, రేడి యేషన్‌ బారినపడి క్యాన్సర్‌కు గురవ్ఞతున్నాయి.కేన్సర్‌కు కారణా లలో ఆధునిక జీవన శైలి ప్రధానమైనది.

చుట్ట, బీడి, సిగరెట్‌, పొగతాగడం,గుట్కా,తంబాకు టొబాకో నమలడం, స్థూలకాయం, అధికబరువ్ఞ, శారీరశ్రమ తక్కువగా చేసేవారు, మద్యం సేవించే వారు, ఈ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. శీరరంలో ఏదైనా అవయవానికి కేన్సర్‌సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవ్ఞ. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. అందరితో సమానమన్న భావన కలిగించడం ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పరిస్థితిని అదుపుచేయలేకపోతే వచ్చే2030 నాటికి మృతుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది.

  • నెరుపటి ఆనంద్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/