నిజమైన నాయకత్వం అతనిదే

ధోనిపై వాట్సన్‌ ప్రశంశల జల్లు

watson
watson

మెల్‌బోర్న్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని, కోచ్‌ ఫెమింగ్‌లను సిఎస్‌కె బ్యాట్స్‌మన్‌ షేన్‌వాట్సన్‌ ప్రశంశలతో ముంచెత్తాడు. తాజాగా క్రికెట్‌.కామ్‌ తో మాట్లాడుతు వాట్సన్‌ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 2018 ఫైనల్‌లో చేసిన సెంచరి ఎంతో ప్రత్యేకమయినది. ముఖ్యంగా ఆ సమయంలొ కోచ్‌ ఫ్లెమింగ్‌తో కలిసి పనిచేయడం. నేను పనిచేసిన కోచ్‌లలో అతడు అత్యుత్తమం. చాలా బాగా ఆటను అర్ధం చేసుకుంటాడు. ఇక ధోనితో కలిసి ఆడడం అంటే అదో గొప్ప అనుభూతి. అతడు మైదానంలో ఐస్‌ మ్యాన్‌లా ఉంటాడు. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడడం నా అదృష్టం అని వాట్సన్‌ చెపుకొచ్చాడు. అలాగే ధోని నాయకత్వంపై కూడా ప్రశంశలు కురిపించాడు. అసలు ధోని లాంటి సారధే లేడని, నిజమైన నాయకత్వం అతనిదేనని వాట్సన్‌ అన్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/