ప్రజావాక్కు: సమస్యలపై గళం

Voice ot the people
Voice ot the people

పార్టీల మనుగడ ప్రశ్నార్థకం:- ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ ఎన్నికల లో ఘనవిజయాన్ని సాధించాయి.జాతీయపార్టీ బిజెపిని మట్టి కరిపించాయి. వీటితోపాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, జార్ఖండ్‌ ముక్తిమోర్చా,సమాజ్‌వాదిపార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌, శివసేన, బిజుజనతా వంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికలలో విశేష ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ రాష్ట్రాలలో బిజెపి విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వీటిధాటికి తట్టుకోలేక ఆయా రాష్ట్రాలలో బిజెపి చిత్తుచిత్తుగా ఓడిపో తోంది. కనీసం బోటాబోటీ మెజారిటీ అయినా సాధించలేక చతికిలబడుతోంది. ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీ లపైన ఆధారపడుతోంది.కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రాంతీయ పార్టీల మూలంగా కాంగ్రెస్‌, బిజెపిల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

పార్టీ ఫిరాయింపులు మంచిదికాదు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

బెల్లం చుట్టూ ఈగలు ముసిరే చందాన అధికార పార్టీవైపు విపక్ష ఎమ్మెల్యేలు, ఎంపిలు ఆకర్షితులవడం సహజమే. అయి తే ఈ రకమైన రాజకీయ ఫిరాయింపులు ఈ మధ్యకాలంలో అడ్డూ అదుపు లేకుండా సాగడం బాధాకరం. తెలంగాణాలో ఎన్నికలు అయిన నెల రోజులలోపే ఏకంగా 12 మంది విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనికి దూకేసారు. అత్యధికంగా మహారాష్ట్రలో ఎన్నికల ముందు యాభై మంది విపక్ష ఎమ్మె ల్యేలు అధికారపక్షంలోనికి దూకేసారు. కర్ణాటకలో అధికార ఎమ్మెల్యేల ఫిరాయింపు కారణంగా ప్రభుత్వం కుప్పకూలింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ వంటి పేర్ల ద్వారా పదవ్ఞలు ఎరవేసి అధికార పార్టీలు విపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుండగా దీపం వ్ఞండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన ఎమ్మెల్యేలు తమ సిద్ధాం తాలను గంగలోకలిపేసి అవతలిపక్షంలోనికి దూకేస్తున్నారు.

సిలబస్‌ను కఠినతరం చేయాలి:-కె. అన్నపూర్ణ, విశాఖపట్నం

ప్రభుత్వం సిలబస్‌ను కఠినతరం చేయలి. సిలబస్‌ కఠిన తరంచేయలేకపోతే విద్యార్థులు చదువ్ఞలపై దృష్టి పెట్టరు. ఆడుతూ,పాడుతూ చదివితే జ్ఞానంతలకెక్కదు. సీరియస్‌ గాచదవాలి.అయితే లెక్కలు మరీ కఠినంగా ఉండరాదు. జీవితానికి సంబంధించిన లెక్కలు, ఆరోగ్యం శరీర నిర్మా ణం లాంటి విషయాలపై పాఠాలుండాలి. వివిధ మతాల గురించి, సమగ్ర పాఠాలుండాలి.

వయోపరిమితి 60 సంవత్సరాలు:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

వృద్ధులకు సంబంధించిన అనేక పథకాలను వర్తింపచేసేందుకు కేంద్రప్రభుత్వం వయో పరిమితిని 60 సంవత్సరాలుగా నిర్ణ యించింది. కాని అనేక ప్రైవేట్‌ సంస్థలలో ఉద్యోగులు 56-58 ఏళ్లకే పదవీ విరమణ చేస్తున్నారు. వారందరికీ ప్రభుత్వ పథ కాలు, రాయితీలు వర్తింప చేసే వయోపరిమితిని తగ్గించడం ఎంతో అవసరం. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగం అనే బేధం లేకుండా అందరికీ ప్రధానమంత్రి వయోవందన పింఛను పథ కాన్ని విధిగా అమలుచేయాలి. అసంఘటిత రంగంలో పింఛను పథకం సక్రమంగా అమలయ్యేందుకు ప్రభుత్వాలు కొత్త ప్రణా ళికలు సిద్ధం చేయాలి. జీవిత బీమా, ఉచిత ఆరోగ్యపథకాలు అందరికీ వర్తింపచేసేలా కొత్త విధానం అమలు చేయాలి. జీవన వ్యయం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్‌ సిటిజన్స్‌కు తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు అందచేసే సాధ్యాసాధ్యాలను కూడా ప్రభుత్వాలు పరిశీలించాలి.

జనాభా నియంత్రణకు చర్యలు: -షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌

విపరీతంగా పెరిగిపోతున్న జనాభా పట్ల ఆందోళన చెందే ప్రభుత్వాలు దాని నియంత్రణ విషయంలో సరైన విధంగా ముందుకు సాగకపోవడం విచారకరం. వచ్చే నెలలో జనాభా లెక్కల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జనాభా నియంత్రణ అవసరంపై విస్తృత ప్రచారం చేపడితేబాగుంటుంది.జనాభా పెరుగుదల వల్ల సంభ వించే అన్నిరకాల దుష్ప్రభావాల గురించి, నియంత్రణకు తీసు కోవలసిన జాగ్రత్తలు,పద్ధతులు గురించి తెలియచేయాలి. నిరక్ష రాస్యులకు సైతం సరిగ్గా అర్థమయ్యేలా బొమ్మలతో కూడిన కరపత్రాలను ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికీ అందచేస్తే మరింత బాగుంటుంది కదా! నిజానికి మనదేశంలో జనాభా లెక్కలకు,అసలు జనాభాకు చాలా తేడా ఉంటుంది. సేకరణ శాస్త్రీయంగా సమర్థంగా జరిగేలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.

రహదారుల నిర్మాణం చేపట్టాలి : -జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాల

చాలాచోట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మట్టిరోడ్లు ఇంకా బిటి రోడ్లుగా మారలేదు. సంవత్సరాలు గడుస్తున్నా మట్టి రోడ్లకు మోక్షంలేదని ప్రజలు విస్మయానికి గురవ్ఞతున్నా రు. మట్టిరోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలకు ప్రాణం పైకి వస్తుంది. ప్రభుత్వం వాగ్దానాలు చేస్తుంది కానీ అమలులో మాత్రం జాప్యం చేస్తుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/