ఇంజినీరింగ్‌ విద్యార్థుల గమ్యం ఎటు?

యువతే జాతి పురోగతికి మూలాధారం. నేటి యువకులే రేపటి దేశ భవిత నిర్ణేతలు. యువజన శక్తియుక్తులే దేశాభివృద్ధి కి బాటలు అంటూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి గల్లీ స్థాయి నాయకుడి నుండి జాతీయ నాయకుల వరకు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు.అందుకోసం వేలాది కోట్లు వెచ్చిస్తూనే ఉన్నారు.కానీ ఆశించిన ఫలితాలు కన్పించడం లేదు.

Students (File)

యువజనుల్లో రోజురోజుకు నిరుత్సాహం పెరిగి పోతున్నది. నిరక్షరాస్యులైన యువకులే కాదు ఉన్నత చదువ్ఞలు అభ్యసించినవారు కూడా నిరాశానిస్పృహలకు లోనవ్ఞతున్నారు.పట్టణాల్లో ఉన్న యువజనుల పరిస్థితి అందుకు మినహాయింపు కాకపోయినా రాష్ట్రప్రగతికి పట్టు కొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత పరిస్థితి అత్యంత దారుణంగా తయారవ్ఞతున్నది. చదివిన చదువ్ఞ లకు తగ్గట్టుగా ఉపాధి దొరకకపోయినా జీవించేందుకు అవసరమైన కనీస సంపాదనకు నోచుకొని దుర్భర పరిస్థి తుల్లో కొట్టుకుమిట్లాడుతున్నారు.

డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయే షన్‌ ముఖ్యంగా ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సు లు విజయవంతంగా పూర్తిచేసిగ్రామాల్లో రోజువారీ వ్యవ సాయ కూలికి వెళ్లలేక ఒకవేళ పరిస్థితుల ప్రభావంతో వెళ్లినా అలవాటులేని కష్టం చేయలేక లక్షలాది మంది యువకులు ఇబ్బందిపడుతున్నారు. పనిచేసే శక్తి ఉంది. ఉన్నంతలో కొద్దోగొప్పో మేధాశక్తి ఉంది. కష్టపడి పని చేయాలనే ఉత్సాహంఉంది.సంఘంలో తమకు ఓ స్థానం కల్పించుకోవాలనే తపన ఉంది. ఏ ఆధారం లేక నిరు త్సాహంగా అర్థాకలితో అసంతృప్తితో అల్లాడిపోతున్నారు.

మరికొందరు ఏదోరకంగా విదేశాలకు వెళ్లి తమ విజ్ఞానా న్ని మరింత రూపొందించుకొని అక్కడే సేవలు అందించ డానికి ఆరాటపడుతున్నారు. ఇలా విదేశాలకు వెళ్తున్నవారి లో తెలుగురాష్ట్రాలే అగ్రస్థానంలో ఉన్నాయి.ఇలావీరంతా ఎందుకు వెళ్తున్నారన్నది ప్రత్యేకంగా చర్చించాల్సిన అవ సరం లేదు.ఒకవేళ వీరంతా ఇక్కడే సేవలు అందించాల నుకున్నా వారికి తగిన వసతులు, వేతనాలు చెల్లించడం లో పాలకులు విఫలమవ్ఞతున్నారని చెప్పొచ్చు.

అసలు విద్యావిధానంలోనే మార్పులు రావాలని, ఉద్యోగం కోస మే విద్యాబోధన కాకుండా జీవనోపాధి కల్పించేవిధంగా ఉండాలని ఎన్నోఏళ్లుగా చెప్తూనే ఉన్నారు.కానీ ఆ దిశలో అడుగులు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008-10 సంవత్సరాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలలు విపరీతంగా పెరిగిపోయాయి. సాంకేతిక విద్యపై అందరూ భారీగా ఆశలు పెంచుకున్నారు.

హైదరాబాద్‌ అతిపెద్ద కేంద్రంగా చేసుకొని వివిధ కంపెనీలు భారీ ఉద్యోగఅవకాశాలు కల్పించాయి. దీంతో పదోతరగతి తర్వాత ఇంటర్మీడియేట్‌ ఎంపిసిలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కానీ కళాశాలలు పెరిగాయి. నాణ్యమైన విద్య అందుబాటులో లేకుండాపో యింది.అందులో అనేక కళాశాలల్లో అర్హులైన అధ్యాపకు లు లేకుండాపోయారు.

లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంజినీరింగ్‌ విద్యఅభ్యసించినా ఎలాంటి నైపుణ్యాలు అందని దురదృష్టపు పరిస్థితులు దాపురించాయి. దీంతో ఇంజినీరింగ్‌ పట్టభద్రులు మరో దారిలేక జీవనోపాధి కోసం ఏదో దొరికిన ఉద్యోగానికి వెళ్లిపోతున్నారు. మొన్న పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగానికే కాదు మరికొన్ని ప్రాంతాల్లో రోజువారీ కూలీకి కూడా వెళ్తున్న ఇంజినీరింగ్‌ చదివిన యువకుల గురించి తెలిస్తే ఆవేదన కలుగుతుం ది. అటవీశాఖలో ఇంటర్మీడియేట్‌ అర్హత కలిగిన బీట్‌ అధికారుల ఉద్యోగాలకు ఎంటెక్‌చదివిన విద్యార్థులు పోటీ పడ్డారు.

అందులో అరవైశాతం మందికిపైగా బిటెక్‌,ఎంటెక్‌ చేసిన విద్యార్థులే ఎంపికయ్యారు.దేశంలో ఏటా ఎనిమిది లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చు కొని బయటకు వస్తున్నారు. వీరిలో నలభైశాతం మంది మాత్రమే వివిధ రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. అంటే మిగిలిన అరవై శాతం వరకు దాదాపు ఐదు లక్షల మంది ఏటా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. తెలం గాణ రాష్ట్రాన్ని తీసుకున్నా 2015-16లో 84.41శాతం ఇంజినీరింగ్‌ విద్యార్థులు పట్టా తీసుకోగా అందులో 43 శాతంకూడా ఉద్యోగాలు పొందలేదు.

రానురానుఉద్యోగాలు పొందేవారి సంఖ్య తగ్గిపోతున్నది.ఇందుకు నాణ్యతా నైపుణ్యాలు లేకపోవడం వల్లనే ఉద్యోగాలు రావడం లేదనేది మరొక వాదన. దేశంలో ఇంచుమించు 90శాతం ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అవసరం మేరకు నైపుణ్యత లేదని, కేవలం ఐదుదారు శాతం మందిమాత్రమే కనీస స్థాయి ‘ప్రోగ్రామ్‌కి అవసరమైన ‘కోడ్‌ రాయగలిగిన స్థితిలో ఉన్నారని ‘అస్సైండ్‌రింగ్‌ మైండ్స్‌ నివేదిక గతం లో వెల్లడించింది. ఇన్నాళ్ల తర్వాత అయినా ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఇంజినీరింగ్‌ విద్యకు సరికొత్త రూపు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేయబోతున్న ట్లు అందుతున్న వార్తలు ఎంతో ఊరట కలిగిస్తున్నాయి.

ఇంజినీరింగ్‌ విద్యకు సంబంధించి స్వరూపమే పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచా రం. 2020-21 విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లోనూ పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్న కోర్సులను అందుకు అనుగుణంగా మార్పు చేసిన విద్యా విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం కట్టింది.

విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, పరిశోధన, ఆవిష్కరణలవైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రవేశపెట్టిన సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్రంలో కాలేజీలను తీర్చిదిద్దబోతున్నారు.

ఈ సంస్కరణల అమలును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా ప్రోత్సాహం అందిస్తున్నది. ఒక్క ఇంజినీరింగ్‌ విద్య విషయంలోనే కాదు ఇతర అన్ని కోర్సులు కూడా జీవనోపాధికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/