ఇరు రాజ్యాంగాలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్య

అందమైన పదాలతో మన రెండు రాజ్యాంగాలు ప్రారంభమౌతాయి

Donald Trump
Donald Trump

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో ఎంతో సంతోషంగా కనపిస్తున్నారు. ఇక్కడి ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతుండడం పట్ల ట్రంప్ ఆనందం అంతాఇంతా కాదు. మోదీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అపూర్వ స్వాగత కార్యక్రమాలు, నమస్తే ట్రంప్ ఈవెంట్ తో ట్రంప్ తన ప్రతిష్ఠ మరింత ఇనుమడించినట్టుగా భావిస్తున్నారు. ఈ సంబరాల వేళ ఆయన ట్విట్టర్ లో స్పందించారు. మన రెండు రాజ్యాంగాలు ‘వియ్ ద పీపుల్’ అనే మూడు అందమైన పదాలతో ప్రారంభమవుతాయి. దానర్థం, అమెరికాలో కానీ, భారత్ లో కానీ గౌరవం, మర్యాద, విశ్వాసం, సాధికారత, ప్రజల కోసం పోరాడే విధానం ఒకే విధంగా ఉంటాయి అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు మరో ట్వీట్ ను హిందీలో చేశారు. ఇది ఆరంభం మాత్రమేనని, అమెరికా, భారత్ తమ అనుబంధాన్ని మరింత దృఢతరం చేసుకుంటాయని, ప్రజల ఆకాంక్షలను మరింత ఉజ్వలంగా నెరవేర్చుతాయని పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/