తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల హామీలను నెరవేర్చేలా పనిలోపడింది. ఇప్పటికే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం..ఆరోగ్యం శ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేసిన కాంగ్రెస్..నేటి నుండి అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలుపెట్టింది.

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబదించిన వివరాలు ఈ దరఖాస్తు పత్రంలో పొందుపరిచారు. ప్రజలు ఆ దరఖాస్తు పత్రాన్ని నింపి..అధికారులకు ఇవ్వాల్సి ఉంది. ఈ దరఖాస్తు పత్రంలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత.. అయిదు పథకాల వివరాలు ఈ ఫారంలో ఉన్నాయి. ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా.. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. అన్ని పథకాలకూ అర్హులైనా.. ఒకే దరఖాస్తులోని ఆయా వివరాలు నింపితే సరిపోతుంది. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో ఇవ్వా్ల్సి ఉంటుంది.