ప్రజావాక్కు: సమస్యలపై ప్రజల గళం

People
People

ప్రభుత్వ నిర్ణయాలతో సమస్యలు:- ఎం.శ్రీనివాస్‌, హైదరాబాద్‌

పాలకుల తప్పుడు నిర్ణయాల వల్ల ఎంతోమంది అమాయకు లు అన్యాయంగా చనిపోతున్నారు.గతంలోనూ ఇలానే చనిపో యారు. అయితే ఎంతమంది చనిపోతున్నా తమకేమి పట్ట నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లుఅంటూ మూర్కంగా వాదిస్తున్నారు.ప్రజలు, విద్యార్థులు, ప్రతిపక్షాలు,ప్రజాస్వామ్యవాదులు ఇంకా అనేక మంది స్వచ్ఛ´ం దంగా ముందుకొచ్చి పోరాడుతున్నా పౌరసత్వ సవరణ చట్టా నికివ్యతిరేకంగా అలజడులు,ఆందోళనలు, నిరసనలు చేస్తున్నా వినటం లేదు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తెచ్చి తీరుతామంటున్నారు. వీరి ఒంటెద్దు పోకడలతో విసిగిపోయి ఇప్పటికే కొన్నిమిత్రపక్షాలు దూరమయ్యాయి.మరికొన్ని మిత్ర పక్షాలు కూడా బిజెపికి దూరమవడానికి సిద్ధపడుతున్నాయి.

సవాళ్లను ఎదుర్కోవాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పదోతరగతి, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. గతంలో కార్పొరేట్‌ విద్యాసంస్థలు పెట్టిన ఒత్తిళ్లకు తట్టుకోలేక విద్యార్థులు పరీక్షలలో విఫలమవడమో లేక మార్కులు సరిగ్గా రాకపోతే ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం జరి గాయి.విద్యాభ్యాసం అనేదిఆహ్లాదంగా, ఆనందంగా సాగాలని, పరీక్షా సమయంలో ఒత్తిళ్లకు తావీయరాదని ప్రధానిమోడీ సెలవిచ్చినా విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు. పరీక్షలకు మూడు నెలల ముందు నుండి రోజుకు 12-16 గంటలపాటు బలవంతంగా చదివిస్తూ వారిని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి రాకుండా ప్రభుత్వం, తల్లి దండ్రులు ప్రణాళికలు అమలు చేయాలి. జీవితమంటే జ్ఞాన సముపార్జన,సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్పితే పరీక్షలు,మార్కులు,కాదన్న విషయం వారికి స్పష్టం చేయాలి.

పల్లెల రూపురేఖలు మారుస్తున్న పల్లెప్రగతి:-కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్‌, భూపాలపల్లిజిల్లా

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు అభివృద్ధి పయనంలో పయనిస్తే రాష్ట్రం అన్నిరంగాలలో ముందుకుపోతుంది. తద్వా రా దేశం అభివృద్ధి చెందుతుంది. పల్లెప్రగతి మొదటి విడత సెప్టెంబర్‌లో 30రోజుల పాటు జరిగింది. ఇందులో ప్రజలు, అధికారులుపూర్తిస్థాయిలో భాగస్వాములైనారు. గ్రామసర్పంచ్‌ లు,ఉపసర్పంచ్‌లు,వార్డుసభ్యులు,కో-ఆప్షన్‌ సభ్యులు ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో పల్లెప్రగతి మొదటివిడతను విజ యవంతంగా పూర్తి చేసి గ్రామాలను అందంగా తీర్చిదిద్దారు. అదే విధంగా రెండో విడత పల్లెప్రగతిని కూడా సాధించాలి.

ఆకాశాన్నంటుతున్న ధరలు:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలో ఉల్లిపాయలతోపాటు అన్ని కూరగాయలు, నిత్యావసర సరుకులధరలు ఆకాశానంటుతున్నాయి. ఉల్లిపాయలుకిలో వంద, కందిపప్పు 130 రూపాయలు, మినపప్పు 120 రూపాయలు, వంటనూనెకిలో 120 పలుకుతుండగా కూరగాయలు దాదాపు గా కిలో60-80మధ్య ఉన్నాయి. అత్తెసరు జీతభత్యాలతో దిన దినగండం నూరేళ్ల ఆయుష్షు చందాన బతుకుబండి ఈడుస్తు న్న పేద,మధ్య తరగతి వర్గం వారికి ఆకాశానంటుతున్న నిత్యా వసర సరుకులధరలు చూస్తుంటేకళ్లు తిరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు జీతభత్యాలను పెంచడంలో తీవ్ర తాత్సారం కనబరుస్తుండగా మరొకపక్క ధరలు నియంత్రించ డంలో పూర్తిగా విఫలమయ్యాయి. మండిపోతున్న ధరలు కార ణంగా సామాన్యులకు రోజు గడవడం కష్టంగా వ్ఞంటే దళారీ వ్యవస్థ కారణంగా రైతులకుఆశించిన లాభాలు అందడం లేదు.

రగులుతున్న రాజధాని:-కె. వేణుగోపాల్‌ రెడ్డి, గంగవరం, చిత్తూరుజిల్లా

తరతరాలకు ఉపయోగపడే విధంగా నిర్మించవలసిన రాజధాని విషయంలో రచ్చరచ్చకావడం బాధకలిగిస్తుంది. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ ఆలోచన ప్రకారం రాజధానిని నిర్మించరాదు. అన్ని ప్రాంతాల ప్రజలకు అన్ని రంగాల ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు, ఉద్యోగులకు అందుబాటులో వ్ఞంటూ భవిష్యత్తు లో రాబోయో తరాల వారికి ఎటువంటి కష్టం, నష్టం జరగని విధంగా సరైనస్థలాన్ని ఎంచుకొని రాజధానినినిర్మించాలి. మన ఆర్థిక స్థితిగతులను పట్టించుకోకుండా అప్పుల మీద అప్పులు చేసి అంతస్తుల మీద అంతస్తులు, అద్దాల మేడలు కడితే రాజ ధానికి గుర్తింపు రాదు. మన నాగరికత మన సంస్కృతి ప్రతి బింబించే విధంగా అన్నిరకాల మౌలిక వసతులు కల్పించి వాటి ని సక్రమంగా నిర్వహిస్తే రాజధాని అభివృద్ధి జరిగితీరుతుంది.

ఇంధన ధరలను నియంత్రించాలి: -టి.సి.సాంబశివరావు, నరసరావుపేట, గుంటూరుజిల్లా

గత ఐదు నెలలకాలంలో గ్యాస్‌ పంపిణీ సంస్థలు, సబ్సిడీ లేని గ్యాస్‌ సిలిండర్‌ ధరకు రూ.150 వరకు పెంచారు. సబ్సిడీ గ్యాస్‌ వాడేది సంపన్న వర్గాలేగాక సామాన్యులెందరో ఉన్నారు. గతంలో ప్రధాన మోడీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పేదలకు చౌకగా గ్యాస్‌ అందించడానికి స్థితిపరుల సబ్సిడీగ్యాస్‌ వదులుకోవాలని కోరితే సామాన్యలెందరో సదుద్ధేశంతో సబ్సిడీ వదులుకున్నారు. గతంలో పెట్రోల్‌ ధరలు ప్రభుత్వ నియంత్ర ణలో ఉండేవి. ఇప్పుడు కూడా ఇంధన ధరలను ప్రభుత్వం నియంత్రణలోనికి తీసుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/