ప్రజావాక్కు

సమస్యలపై ప్రజాగళం

Handloom sector

చేనేత భరోసా కేంద్రం ఏర్పాటు చేయాలి – యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

కూడు, గుడ్డ, గూడు మానవులకు దైనందినావసరాలు, తిండి గింజలు పండించే రైతన్న,ఒళ్లు కప్పేందుకు నేతన్న బట్ట లేకపోతే బతుకూ, నాగరికతే లేదు.ఈ రెండు వృత్తులపై భార తదేశంలో సగం మంది జీవనం సాగిస్తున్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీరికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది సుస్ప ష్టం. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులకు కొంతలో కొంత పరిష్కార మార్గాలు సూచి స్తుంది.

రాత్రింబవళ్లు మగ్గంగోతిలో రెక్కలు ముక్కలు చేసు కున్నా సరైనకూలి లభించక, సొసైటీ, ఆప్కోలో పెరిగిపోతు న్న నిల్వలు, అమ్మకాలపై ప్రభుత్వ సహకారం లేకపోవడంతో కులవృత్తిపై ఆధారపడ్డ యువత ఇతర మార్గాలవైపు చూడ టంతో నానాటికీ చేనేత దిగజారిపోతుంది.

రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చేనేత భరోసా కేంద్రం కూడా ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలి.

భయంగొలిపే బావి హత్యలు: -బి.ఎన్‌.సత్యనారాయణ,హైదరాబాద్‌

వరంగల్‌ జిల్లాలో బావి హత్యలు ఉదంతం అందరిలో ఎంతో భయం కలుగచేసింది. మనిషి ఎందుకు ఇంత కిరాతకంగా తయారవ్ఞతున్నాడన్న ఆవేదన అందరి హృదయాలను తొలిచి వేస్తోంది. మనచట్టాలు,న్యాయాలలోని బలహీనతల్ని ఇటువం టి దురాగతాలు బహిర్గతం చేస్తున్నాయి.

అసలు నేరాలు పెరిగిపోవడానికి వివాహేతర అక్రమ సంబంధాలే మూలాలని పలు సర్వేలు కూడా తెలుపుతున్నాయి.

ఈ దురాగతంలో సహజీవనం చేస్తున్న స్త్రీనే కాకుండా ఆమె బిడ్డపై కన్నేసి కాటేయాలని చూసిన మృగాడి పన్నాగం ఫలించకపోవడం ఈ హత్యలకు కారణమైంది.

అటువంటి కిరాతకుడికి జైలుశిక్షలు, జీవితఖైదులు విధించడం కాకుండా ఉరిశిక్ష విధించి తక్షనం అమలు పరచాలి.తద్వారా ఇటువంటి నేరాలోచనలు వైరస్‌లా సమాజాన్ని తొలిచివేయకుండా కట్టడి చేయాలి.

ప్రభుత్వంపై విమర్శలొస్తున్నాయి:-ఎం.రమణారావు, జగ్గంపేట

రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పుల మీద తప్పులు చేస్తుంది. ప్రజలు పస్తులు ఉంటున్నారని ఫ్రీగా బియ్యం, కందిపప్పు, వెయ్యి రూపాయలు తెల్లరేషన్‌ కార్డుదారులకు ఇచ్చే సందర్భం అయినా, కాకపోయినా ప్రభుత్వం ఇష్టం. ఇలా ఎన్నాళ్లు కోట్ల మందికిఇవ్వగలదు.సమయం, సందర్భం ఉండాలికదా! స్థానిక ఎన్నికలుదృష్టిలో పెట్టుకొని ఇస్తుందని అనుకుంటున్నారు.

సిలబస్‌లను తగ్గించాలి:-సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పదవతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్‌ పరీక్షలు పూర్తయినా మూల్యాంకనం ఇంకా ప్రారంభంకాలేదు. కార్పొరేట్‌ కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించి సిలబస్‌ పూర్తి చేయడంలో ముందుకు దూసుకుపోతున్నాయి.

కాగా ప్రభుత్వ కళాశాలలో ఆ సౌలభ్యంలేదు. కాలేజీలు జులైలో తెరిచినా, పరిస్థితులు చక్కబడేందుకు ఇంకొక నెల కనీసం పడుతుంది.

సిబియస్‌ఈ బోర్డు 10, 11,12 తరగతులకు ఈ ఏడాది 20 శాతం సిలబస్‌ తగ్గించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ కూడా బోర్డు పరీక్షలకు సిలబస్‌ తగ్గించి ఆ వివ రాలు ప్రకటించాలి.

తక్కువ సమయంలో మిగతా సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉన్నందున అధ్యాపకులకు ప్రత్యేక ప్రోత్సాహ కాలు ప్రకటించడం అత్యావశ్యకం.

మార్కెటింగ్‌పై నియంత్రణ ఉండాలి:-సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలోస్థూలకాయం సమస్యతీవ్రతరం అవ్ఞతోందన్న జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే-4 నివేదిక ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న మధుమేహ సమస్యకు ఉబ కాయమే కీలక కారకమవ్ఞతోంది.

అంతేకాకుండా అధిక రక్త పోటు,అధిక కొలెస్ట్రాల్‌, హృద్రోగాలు,పక్షవాతం వంటి ప్రాణాం తక వ్యాధులకు ఉబకాయమే ప్రధాన కారణం.

పాఠశాల స్థాయి నుండే బాలబాలికలలో యోగా, మెడిటేషన్‌, క్రీడలు, వ్యాయామం తప్పనిసరి చేయాలి. అందరికీ 30 సంవత్సరాలు దాటాక ప్రతి ఏడాది వైద్యపరీక్షలు తప్పనిసరి చేయాలి.

ఆరోగ్యకరాహారాలు,పానీయాలు, తాజాపండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటివి చవకగా, తేలికగా అందరికీ అందుబాటులో ఉండేలా ఆహార విధానాలు ఉండాలి. మార్కెటింగ్‌పై సరైన నియంత్రణ ఉండాలి.

ఉద్యోగులను ఆదుకోవాలి:-ఎం.వి.రామానుజాచార్యులు, కురుకులూరు, ప.గోజిల్లా

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్ల గురించి ఒక్కసారి ఆలోచించలేదంటే మనుకోవాలి? ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ దాదాపు నెరవేర్చారు.

ప్రభుత్వ అంగాల లో అంకితభావంతో పనిచేస్తున్నవారి పట్ల ఇంత చులకనభావ మా? ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఓటర్లు కాదా?ఎందుకు వారిపట్ల ఇంత చులకనభావన చూపుతున్నారు.

కొత్త ప్రభుత్వం వచ్చిందని ఆనందిస్తే తొమ్మిది నెలల నుండి పిఆర్సీకి అతీగతీ లేదు.ప్రభుత్వందీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/