3 రాజధానులు ..3 రాష్ట్రాలకు పునాదులు!

3 Capitals

ఆంధ్రప్రదేశ్‌లో రాజధానుల గురించి మూడునెలలుగా సాగుతున్న అధికార, ప్రతిపక్షాల వాదవివాదాలు ఇలాగే కొనసాగితే కర్నూలులో హైకోర్టు వచ్చి న్యాయం చేసేదాకా రాజధానుల వ్యవహారం కొన సాగగలదనే విషయంలో ఏమాత్రం సందేహంలేదు. నాడు ఏడాదికి మూడు పంటలు పండుతున్న అమరావతి పరిసర ప్రాంతాలలోని మూప్పై మూడువేల ఎకరాలు పచ్చని భూమిని కాంక్రీట్‌ జంగల్‌ చేయడ మనే ఆలోచనను ప్రతిపక్ష పార్టీలు,నాయకులు వ్యతిరేకించినా విధిలేని పరిస్థితిలో తలలూపడం జరిగింది. అందుకు అసలు కారణం నాడైనా నేడైనా అధికార పార్టీ చేసిందే చెల్లుబాటవ్ఞతుంది.

ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి ప్రాంతీయత నిర్లక్ష్యం అనే నినాదంతో, బలమైన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన నేపథ్యాన్ని ప్రస్తుత పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర,సర్కారు, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి, అసమా నత, ఆర్థికత, వెనుకబాటుతనం తదితర అనేక విషయాలను పరిగణనకు తీసుకునే సందర్భంగా నేడు మనముందు అవశ్యక తగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో అమరావతి, విశాఖ, కర్నూలు ప్రాంతాలు రాజధానులుగా రూపాంతరం చెందడానికి, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న ‘మూడు రాజధానులు అనే విషయాన్ని భవిష్యత్తులో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలవారీగా విడిపోవ డానికి అనుకూలంగా ఒక నిర్ణయానికి రావడమన్న దానిని అంత ర్లీనంగా జరుగుతుండడంతో ఎవరికీ స్పర్థలు లేని అంశంగా స్వాగతిద్దాం!

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం తప్పిదాలు, ప్రస్తుత ప్రభుత్వానికి పట్టం కట్టడానికి ప్రథమ కారణాలుగా చెప్పాల్సి వస్తే అభివృద్ధి అనే మాటకు అమరావతి, పోలవరం మినహా మిగిలిన ఏ ప్రాంతంపై దృష్టి పెట్టకపోవడం, రాజధాని అంశం తప్ప మిగి లిన పరిస్థితులను నిర్లక్ష్యం చేయడమేగాక ఆదిలోనే హంసపాదుగా అమరావతి రాజధానికి, అధికార భవనాలకి, కార్యాలయాలకి తాత్కాలిక నామకరణం చేసి అమరావతిలోని కట్టడాలని తాత్కా లికంగా గుర్తించబడే అవకాశాన్ని ప్రజలలో ప్రతిపక్షాలలో కలిగిం చిందని మరిచిపోరాదు.

నిరుడు వర్షాలలో అమరావతి ముంపు నకు గురైన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులు, వైఎస్సార్సీ నాయకులు రాజధాని ‘మార్పుపై చేస్తున్న ప్రకటనలే గాక తెలుగుదేశం పార్టీలోని కొందరు ఉత్తరాంధ్ర నాయకులు సుముఖులైవ్ఞన్నారన్నది యదార్థం. అంతేగాక కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో బిజెపిలోకి వలసవెళ్లిన నాయకులు వినిపి స్తున్న సన్నాయినొక్కులు గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ ధానుల నిర్మాణాలు ఎంత త్వరితగతిన జరిగితే అంత భూమిని బినామీ పేర్లతో కొనడానికి, వ్యాపారదిశగా మార్చడానికి అనుకూ లంగా ఉంటుందని ఆశపడుతున్న అంతరంగిక వైనం స్పష్టంగా అగుపిస్తూనే ఉంది.

నేడు అమరావతి ఒక్కటే ఆంధ్రప్రదేశ్‌ రాజ ధానిగా ఉండాలనే పలు పార్టీల నాయకులు తమ జిల్లాల్లో రాజ ధానులని ఏర్పాటు చేస్తారంటే ఏ ఒక్కరూ అడ్డుచెప్పరు. నోరు మెదపరుగాక తాము కదలక మెదలక ఉందురన్నది జగమెరిగిన సత్యం. కారణం తన ప్రాంత అభివృద్ధి కోసమని అనుకుంటే పొరపాటు.తమ రాజకీయాభివృద్ధి కోసమేనేది పచ్చినిజం. మూడు కోట్ల జనాభా కలిగిన ఇండోనేషియాలోని ‘జకార్తా ముఖ్యపట్టణా న్ని, ఇండోనేషియాలోని మరో పట్టణమైన ‘బొరివియోకి మార్చబోతున్నట్టు ఆ దేశాధ్యక్షులు ప్రకటించడానికి సమాయత్తమై సంసిద్ధులైనట్టు తెలుస్తోంది. కారణమేమిటంటే తాత్కాలిక అమ రావతిని గుర్తుకు తెస్తోంది.

జకార్తా ముఖ్యపట్టణాన్ని నీటివరద ముంచెత్తుతూ చెమ్మచెత్తలతో ప్రజలు అనారోగ్యం పాలవ్ఞతూ పదుల సంఖ్యలో మరణించడంతో జకార్తా నుంచి బొరివియోకి మార్చే నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. అత్యంత ప్రాచీన నగర మైన జకార్తా ఇండోనేషియా రాజధానినే మార్చవలసి రావడానికి దారి తీసిన పరిస్థితిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకులు గుర్తించాలి. ప్రపంచానికి పరిచయమక్కర్లేని ప్రాచీన పట్టణమైన జకార్తా మారుగా బొరివియోని రాజధానిగా చేస్తున్నప్పుడు కాగి తాలపై లక్షల కోట్లతో నిర్మాణవ్యయంగా రూపొందించిన తాత్కా లిక అమరావతితోపాటు మరో రెండు రాజధానులు నిర్మించడంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఇసుమంతైనా కనిపించదు.

చైనా కి బీజింగ్‌ రాజధాని అయినా చైనాలో రాజధానికే రాజధానిగా కొనయాడబడుతూ వాణిజ్యపరంగానూ, పరిశ్రమలతోనూ, సంపద సృష్టిలోనూ అలరారే షాంఘై అతిపెద్ద నగరమే కాదు, ప్రపంచ పటంలో అతి పురాతనమైన,పేరెన్నికగన్న పట్టణం నేడు సముద్ర పు నీటి చెమ్మతో ప్రతి ఏడాది అయిదు సెంటీమీటర్ల భూమి లోనికి కుంగిపోతున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం షాంఘై లోని పరిశ్రమలని వాణిజ్య కూడళ్లను దాదాపు నగర నగరాన్నే మరో సురక్షిత ప్రాంతానికి తరలించడానికి చర్యలు తీసుకుంటున్న విషయం అధికారికంగానే తెలుస్తోంది. పై రెండు దేశాల్లోని ఆ చారిత్రక మహానగరాలు ప్రపంచ ప్రసిద్ధి చెందడమేగాక అశేష జన వాహినితో కలిగిన ప్రాంతాలు, నీటి ముంపునకు గురైపోతున్న ప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రజలు కానీ, ఏ ప్రతిపక్ష రాజకీయనాయకులు కాని అనవసర రాజకీయ విమర్శలు చేయడం సరికాదు! సంపూర్ణ సహకారమందించడానికి సమాయత్తు లయ్యారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ప్రతిపక్షం, అన ధికార ప్రతిపక్ష నాయకులు గమనించాలి.

ఆంధ్రప్రదేశ్‌లో రాజధా నుల గురించి మూడునెలలుగా సాగుతున్న అధికార, ప్రతిపక్షాల వాదవివాదాలు ఇలాగే కొనసాగితే కర్నూలులో హైకోర్టు వచ్చి న్యాయం చేసేదాకా రాజధానుల వ్యవహారం కొనసాగగలదనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నాడు ఏడాదికి మూడు పంటలు పండుతున్న అమరావతి పరిసర ప్రాంతాలలోని మూప్పై మూడువేల ఎకరాలు పచ్చని భూమిని కాంక్రీట్‌ జంగల్‌ చేయడ మనే ఆలోచనను ప్రతిపక్ష పార్టీలు,నాయకులు వ్యతిరేకించినా విధిలేని పరిస్థితిలో తలలూపడం జరిగింది.

అందుకు అసలు కారణం నాడైనా నేడైనా అధికార పార్టీ చేసిందే చెల్లుబాటవ్ఞ తుంది. కానీ ప్రతిపక్షానిది, ప్రతిపక్షనాయకులది కంఠశోషగానే మిగులుతుందనడానికి ప్రస్తుత ప్రతిపక్షాలైన అన్ని పార్టీల వారికీ రాజధానుల విషయంతో వాస్తవం తెలిసొచ్చింది. ప్రతిపక్ష పార్టీలు, నాయకులు అమరావతే రాజధాని అనే నామజపం వదిలేసే దశ నుంచి అక్కడి రైతులకు న్యాయం చేయాలనే దిశకు మరిపోయా రు. విశాఖ, అమరావతి, కర్నూలు, మూడు ముక్కలాటలో ఆసు, రాజు, రాణిలేవో స్పష్టంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్నూ లులో హైకోర్టు రావడం వలన లాయర్లకి, క్లైంట్‌లకి మినహా మిగి లిన ప్రజానీకానికి ఏమి ఒనగూడుతుందో ఊహకందని విషయం.

రాయలసీమకి ఏమి అభివృద్ధి జరుగుతుందో అర్థంకాని విషయం. అమరావతిలో భూముల్ని ఇచ్చిన రైతులుగాని, మరే ప్రాంతంలో ప్రభుత్వానికే కాదు, కంపెనీలకు, ఫ్యాక్టరీలకు భూముల్ని కేటా యించే సందర్భంలో చేయాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే భూముల్ని అమ్మకానికి కాకుండా కౌలుకు మాత్రమే ఇచ్చినట్లు రాతలు చేసుకోవాలి. ఫ్యాక్టరీలు, కంపెనీలు మూతపడినప్పుడు ఏ రైతులు భూములిచ్చారో ఆ రైతులకే భూములు చెందాయి.

ప్రభుత్వ విషయంలోనూ అదేజరగాలి. రాజధానినే కాదు ఏ ఒక్క కార్యాలయాన్ని మార్చినా అంతవరకు అద్దె ప్రాతిపదికన ఇచ్చినట్లు గానే నిర్ణయాలు చేసుకుని తదనంతరం ఆ భూములు ఎవరైతే ఇచ్చారో వారికే చెందేటట్లు రిజిస్టర్‌ చేయించాలి. ఇటువంటి ప్రాతి పదికన చర్య చేపట్టడంవల్ల రైతులు ఇచ్చిన భూములు రైతులకే చెందుతాయి.

ఇప్పుడు రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజధానుల నిర్మాణానికి కార్యాలయ భవనాలకీ,ఈ చర్య తప్పనిసరిగా చేయా లి. లేకుంటే నేడు తూళ్లూరు, వెలగపూడిమందడం,తదితర అమ రావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలే ఏ ప్రభుత్వమైనా ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడు రాజధానులు అనే ఆలోచన భవిష్యత్‌ విడిపోనున్న కరవ్ఞ ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయల సీమ జిల్లాలకి ఎంతో మేలు జరుగుతుంది. రాజధానుల రూప కల్పనేకాదు, రాష్ట్రాలుగా ఏర్పడక మునుపే రాజధానుల నిర్మాణం జరిగిపోవడంతో రాజధానులకిక అదనపు ఖర్చుల ఊసే అసలుం డదు.

దేశం, రాష్ట్రం, ప్రపంచంలోని సరైన ఆలోచనాపరులైన ఉద్యమకారులెవరైనా ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలన్నింటిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలోనే సత్ఫలితాలు పొందడమన్నది తప్పక జరిగి తీరుతుంది.

  • యక్కలూరి శ్రీరాములు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/