దేశంలో కరోనా కేసులు 724, మరణాలు 17

వెల్లడించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ

corona virus
corona virus

దిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే 27 రాష్ట్రాలను కరోనా చుట్టేసింది. నేటి ఉదయానికి కరోనా కేసుల సంఖ్య 724 కు చేరింని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికి 17 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. ప్రస్తుతం 640 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని, 67 మంది దీని బారి నుండి కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అధికంగా 130 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తెలంగాణలో ఈ కేసుల సంఖ్య 45కి చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/