వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై అధికారులపై చింత‌మ‌నేని ప్రైవేట్ కేసు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై అధికారుల ఫై ప్రవైట్ కేసు పెట్టాడు. ప్రభుత్వం తనను వేధిస్తున్నదంటూ ఆరోపిస్తూ ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు రాహుల్ దేవ్ శర్మ, నవజ్యోత్ సింగ్ గ్రేవాల్, కృష్ణారావు, నలుగురు సిఐలు, ముగ్గురు ఎస్సైల పై కూడా ప్రైవేటు కేసు పెట్టారు. కోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది. ఇక ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ సర్కార్ తనను వేధింపులకు గురి చేస్తుందని, తనను అంతం చేయాలని చూస్తున్నారని, తనకు ముప్పు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ నేపథ్యంలో తనను వేధిస్తున్న తీరు పై, తనకు ప్రాణహాని ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశానని ఆయన వెల్లడించారు. తనను టార్గెట్ చెయ్యటమే వైసీపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన మండిపడుతున్నారు.. ప్రభుత్వ పెద్దలతో పాటుగా, పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చింతమనేని ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు.