బాలయ్య షో లో సందడి చేసిన ప్రభాస్..

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి రికార్డ్స్ నెలకొల్పోతున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తో బాలకృష్ణ హోస్ట్ అవతారం ఎత్తి అభిమానులను మరియు ప్రేక్షకులను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలతో ప్రారంభం అయిన అన్ స్టాపబుల్‌ సూపర్‌ హిట్ అయ్యింది. ప్రస్తుతం రెండో సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఈ షో కు వస్తూ పలు విషయాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఈ షో కు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యారు. ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ లు కలిసి వచ్చి షో లో సందడి చేసినట్లు ఆహా అధికారికంగా తెలిపింది.

ప్రభాస్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే ఆసక్తి సాధారణ ప్రేక్షకుల్లోనూ ఉంది. ఈ 6వ ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్‌లోని అన్‌స్టాపబుల్ సెట్‌లో జరిగింది. ప్రభాస్ ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌తో కూడిన చెక్ షర్ట్‌లో షూట్‌కు హాజరయ్యారు. అంతేకాదు, కొత్త హెయిర్ కట్, కాస్త పెంచిన గెడ్డంతో చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపించాడు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ..బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసాడు.వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె , మారుతీ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు ప్రభాస్.