రైల్లో అండర్‌వేర్‌తో ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన జేడీయూ ఎమ్మెల్యే..

సమాజంలో ఉన్నంత స్థాయిలో ఉన్న వ్యక్తి పబ్లిక్ గా రైల్లో అండర్‌వేర్‌తో తిరుగుతూ నానా రచ్చ చేసాడు. అంతే కాదు తో ఇదేమిటి అని అడిగిన తోటి ప్రయాణికులతో గొడవకు దిగాడు. ఈ ఘటన రాజధాని ఎక్స్‌ప్రెస్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఎమ్మెల్యే గోపాల్ మండల్ ..రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దుస్తులన్నీ విప్పేసి కేవలం బనియన్, అండర్‌వేర్‌పై కనిపించారు. ఈయన ప్రవర్తన చూసి అంత షాక్ తో గొడవకు దిగారు. తన తప్పును సరిచేసుకోకపోగా..తిరిగి తోటి ప్రయాణికులతో గొడవకు దిగాడు. దీంతో సదరు ప్రయాణికులు అధికారులకు పిర్యాదు చేసారు. అక్కడికి చేరుకున్న ఆర్పీఎఫ్, టీటీఈ అధికారులు అండర్‌వేర్‌పై ఉన్న ఎమ్మెల్యే గోపాల్ మండల్ ను చూసి షాక్ అయ్యారు. ఎమ్మెల్యే ను అలాగే ప్రయాణికులను శాంతిప చేసి ..గోపాల్ ను తన ఏ1 కోచ్ సీట్లో కూర్చుపెట్టారు. అప్పటి వరకు ఆయన ఎమ్మెల్యే అని తెలియని ప్రయాణికులు..ఎమ్మెల్యే అని తెలిసాక..ఓ ఎమ్మెల్యే అయ్యుండి ఇలా ప్రవర్తిస్తారా..అని మండిపడ్డారు. గోపాల్ మండల్ మాత్రం తనకు కడుపులో బాగలేదని, అందుకే దుస్తులు విప్పానని అధికారులకు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.