షారుక్..‘పఠాన్’ మూవీ నుంచి బేషరమ్ రంగ్ సాంగ్ విడుదల

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘పఠాన్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘బేషరమ్ రంగ్’ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో దీపికా అందాల ఆరబోత చేయడం..షారుఖ్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా అయిపోయాయి.

స్పెయిన్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో ఇద్దరి మధ్య రొమాంటిక్‌గా చిత్రీకరించిన ఈ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. చిత్రీకరణ సమయంలోనే దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట్ లీకైన విషయం తెలిసిందే. కాగా.. పాట మొత్తం కలర్‌ఫుల్ హాఫ్ బికినీల్లో కనిపించిన దీపిక.. తన కర్వ్‌డ్ బాడీతో అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ చేత అబ్బా అనిపించింది. గతంలో ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్’ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో హిట్ పెయిర్‌గా నిలిచిన ఈ జంట.. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోని బెస్ట్ ఆన్-స్క్రీన్ జోడీల్లో ఒకరు. ఈ మూవీకి విశాల్ శేఖర్ మ్యూజిక్ అందించగా.. కుమార్ లిరిక్స్ రాసిన ‘బేషరమ్ రంగ్’ సాంగ్‌ను శిల్పా రావు, కరాలీసా మోంటెరో, విశాల్, శేఖర్ కలిసి పాడారు. జాన్ అబ్రహాం విలన్ రోల్ పోషించిన చిత్రంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ కామియో రోల్‌లో కనిపించనున్నట్లు వినికిడి. 2023 జనవరి 25 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

YouTube video