వైమానిక దళంలో ఉద్యోగాల ఎంపిక విధానం

Posts in Indian Airforce

వైమానిక దళంలో ఉద్యోగాలు అంటే అషామాషి విషయం కాదు. ఎంతో నేర్పు, నైపుణ్యాలు అవసరం. అయితే ప్రణాళికాబద్దంగా సిద్ధపడితే మీరు ఆశించిన విధంగా ఈ రంగంలో ఎంపిక కావచ్చు. దీనికి కావాల్సింది పట్టుదలతో కూడిన ప్రిపరేషన్‌, గతంలో నిర్వహించిన పరీక్ష పేపర్లను పరిశీలించి, చదివితే సరిపోతుంది.
ఇంటర్‌ లేదా డిప్లొమా పూర్తిచేసిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.
గ్రూప్‌-ఎక్స్‌, గ్రూప్‌-వై
టెక్నికల్‌ ఫిల్డ్‌లో పనిచేయడానికి గ్రూప్‌ ఎక్స్‌ ట్రేడ్‌ పోస్టులు పాలన సంబంధ విషయాల్లో పనిచేయడానికి గ్రైప్‌వై పోస్టులను భారత వైమానిక దళం భర్తీ చేయనుంది.
అర్హతలు: గ్రూప్‌-ఎక్స్‌: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్‌ లేదా తత్సమాన విద్యలో (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులుగా) 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమాలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. డిప్లొమాలో ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరి.
గ్రూప్‌-వై: పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్‌ (లేదా) తత్సమాన కోర్సు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌ సబ్జెక్టులోనూ 50శాతం మార్కులు వచ్చి ఉండాలి. లేదా మూడేళ్ల ఒకేషనల్‌ ఇంటర్‌ను 50శాతం మార్కులతో పూర్తి చేయాలి. ఒకేషనల్‌ కోర్సులో ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50శాతం మార్కులు పొందాలి.
గ్రైప్‌ వై మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌:
గ్రూప్‌-వై మెడికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 శాతం ఇంటర్మీడియెట్‌/ తత్సమాన కోర్సు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులుగా 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50శాతం మార్కులు తప్పనిసరి.
-డిప్లొమా విద్యార్థులు గ్రూప్‌-ఎక్స్‌ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
వయసు
-జనవరి 17,2000 నుంచి డిసెంబరు 30,2003 మధ్య జన్మించి ఉండాలి. 21 ఏళ్లు మించకూడదు.

  • ఎత్తు కనీసం 152.5 సెంటీమీటర్లు ఉండాలి. ఊపిరి పీల్చకముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలి. కంటి, వినికిడి, దంత సమస్యలు ఉండకూడదు.
    ఎంపిక విధానం: దరఖాస్తుచేసుకున్న అభ్యర్థులను రెండు దశలు ఫేజ్‌-1, ఫేజ్‌-2ల్లో పరీక్షలు నిర్వమించిఎంపిక చేస్తారు. ఫేజ్‌-1లో ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఉంటుంది. ఫేజ-1 అర్హత సాధించిన అభ్యర్థులను ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు.
    ఫేజ్‌-1 గ్రూప్‌ ఎక్స్‌: ఈ పోస్టులకు ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు.
    ఫేజ్‌-1 గ్రూప్‌ వై: ఈ పోస్టులకు ఇంగిల్ష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌పై పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. ఈరెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థలకు ఫిజిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌పై పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు.
    ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, రీజనింగ్‌ సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తే ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కుల నుంచి 1/4 మార్కుల కోత ఉంటుంది.
    ఫేజ్‌-2 ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌:
    ఫేజ్‌-1 పరీక్ష జరిగిన 25 రోజుల అనంతరం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఎయిర్‌మెన్‌ సెలక్షన్‌ సెంటర్‌కు తమ సర్టిఫికెటలను తీసుకొని వెళ్లాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయ్యాక ఫేజ్‌-2కు సంబంధించి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో భాగంగా 1.6కిలో మీటర్ల దూరాన్ని ఆరున్నర నిమిషాల్లో పూర్తిచేయాలి. అలాగే నిర్ణీత కాల వ్యవధిలో 10 పుష్‌ అప్స్‌, 1- సిట్‌ అప్స్‌, 2- స్క్వాట్స్‌ పూర్తిచేయాలి. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (ఫిఎస్‌టి)లో అర్హత సాధించిన అభ్యర్థులకు అడాప్టబిలిటీ టెస్ట్‌-1, టెస్ట్‌-2 ఉంటాయి. అభ్యర్థి ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగానికి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తారు. టెస్ట్‌-1 మొత్తం ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు టెస్ట్‌-2 జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ ఉద్గోయంలో భాగంగా అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మిలిటరీ వాతావరణ మార్పులకు అభ్యర్థులు అలవాటు పడగలరా లేదా తెలుసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ రెండు టెస్టల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించి ట్రెయినింగ్‌ కోసం ఎంపిక చేస్తారు.
    ముఖ్య సమాచారం
    దరఖాస్తు: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
    దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 02, 2020
    దరఖాస్తులకు చివరితేది: జనవరి 20,2020
    పరీక్ష ఫీజు: రూ.250
    పరీక్ష తేదీలు: 2020 మార్చి 19నుంచి 23వ తేదీ వరకు
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://airmenselection.cdac.in

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/