ట్రంప్ తలకు వెలకడుతూ.. ఇరాన్‌ సంచలన ప్రకటన

ట్రంప్ ను చంపిన వారికి రూ. 575 కోట్లు ఇస్తాం

Trump
Trump

ఇరాన్‌: ఇరాన్‌ అమెరికాఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సైనిక ఉన్నతాధికారిని చంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ట్రంప్ తలకు వెలకట్టింది. ట్రంప్ ను చంపినవారికి రూ. 575 కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇరాన్ జనాభా 8 కోట్లని… ట్రంప్ ను హతమార్చిన వారికి ప్రతి ఇరాన్ పౌరుడు తన వాటాగా ఒక డాలరును ఇస్తాడని తెలిపింది. సులేమానీ అంతిమయాత్ర జరుగుతున్న సమయంలో ఆ దేశ అధికార వార్తా సంస్థ ఈ ప్రకటనను ప్రసారం చేసింది. మరోవైపు తమ దేశం నుంచి అమెరికా బలగాలు వెంటనే వెళ్లిపోవాలని ఇరక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాక్ లో సైనిక స్థావరాల కోసం ఎంతో ఖర్చు చేశామని… ఆ మొత్తాన్ని చెల్లిస్తే తప్ప అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలన్నింటి నేపథ్యంలో, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/