ట్రెండ్ సెట్టర్ మూవీకి 31 ఏళ్లు

స్క్రీన్ ప్లే విషయంలో కొత్త పాఠాలు నేర్పించిన ‘శివ’

Shiva-31 years to the trend setter movie
Shiva-31 years to the trend setter movie

టాలీవుడ్ లో అంతకు ముందు వరకు చాలా రొటీన్ సినిమాలు ఫ్యామిలీ డ్రామాలు వచ్చాయి.

తెలుగు సినిమాకు కొత్త హంగులు అద్దడంతో పాటు స్క్రీన్ ప్లే విషయంలో కొత్త పాఠాలు నేర్పించిన సినిమా ‘శివ’ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హీరోను ఓ రేంజ్ లో చూపించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శివ సినిమాలో అనుసరించిన విధానం ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది దర్శకులకు ఆదర్శంగా నిలిచింది అనడంలో సందేహం లేదు.

మొదటి సినిమానే అయినా కూడా రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాను తెరకెక్కించిన తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

ఇలాంటి ప్రయోగాత్మక సినిమాను కమిట్ అయినందుకు నాగార్జున కూడా అభినందనీయుడు అనడంలో సందేహం లేదు.

1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా నేటికి విడుదలయ్యి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. శివ సినిమా తర్వాత ఆ సినిమాలో నటించిన వారు..

ఆ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి పొజీషన్ కు వెళ్లారు. మొదటి సినిమాతోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ మారిపోయాడు.

ఆ సినిమా నాగార్జున మరియు అమలలు స్టార్స్ గా మారడంలో ఉపయోగపడింది అనడంలో సందేహం లేదు.

కేవలం 55 రోజుల్లో చిత్రీకరణ పూర్తి అయిన ఈ సినిమా 22 సెంటర్స్ లో వంద రోజులను ఐదు సెంటర్స్ లో 175 డేస్  ఆడింది.

నంది అవార్డుతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం దక్కించుకున్న ఈ సినిమా ఇప్పటికి ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనడంలో సందేహం లేదు.

1990లో ఈ సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

నేటికి 31 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా సోషల్ మీడియాలో 31 ఇయర్స్ ఫర్ సౌత్ ఇండియా సూపర్ హిట్ శివ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/