బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి లాభం లేదు..పొన్నాల

హైదరాబాద్‌: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ..ఒక తెలుగు మహిళా బడ్జెట్ ప్రవేశ పెట్టినా తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి లాభం లేదని లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఖఉపాధి రంగాన్ని కాపాడటానికి ఎక్కడా బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా ఎక్కువగా పెరిగాయి. పేదింటి బడ్జెట్ అన్నారు. పేదింటి రాయితీలు ఎక్కడా లేవు. దేశంలోనే హైదరాబాద్ మెట్రో చాలా పెద్దది అన్నారు. మరి హైదరాబాద్ మెట్రో పొడిగింపునకు, విస్తరణకు ఏం కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రానికి టీఆర్‌ఎస్, బిజెపిలు శాపంగా మారాయి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో రెండు పార్టీలు విఫలం అయ్యాయిగ అని ఆరోపించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/