కేంద్ర బడ్జెట్‌..లాభాల జోష్‌లో మార్కెట్లు

ముంబయి: కేంద్రం ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌ .. స్టాక్‌ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్లు లాభపడి 48,601కి పెరిగింది. నిఫ్టీ 647 పాయింట్లు లాభపడి 14,281కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. బ్యాకింగ్ 8.33 శాతం, ఫైనాన్స్ 7.49 శాతం, రియాల్టీ 6.65 శాతం పెరిగాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.03 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/