చిన్నజీయర్‌ ఆశ్రయానికి వెళ్లనున్న సిఎం కెసిఆర్‌

నేడు సాయంత్రం చిన్న జీయర్ ఆశ్రమానికి సిఎం ..కొండ పోచమ్మసాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిన్న జీయర్‌ను ఆహ్వానించనున్న కెసిఆర్‌

Chinna Jeeyar Swamy – CM KCR

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సిఎం కెసిఆర్‌ ఈరోజు సాయంత్రం చిన్న జీయర్ ఆశ్రమానికి వెళ్లనున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను కలవనున్నారు. కొండ పోచమ్మసాగర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిన్న జీయర్‌ను సిఎం కెసిఆర్‌ ఆహ్వానించనున్నారు. కాగా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సిఎం కెసిఆర్‌‌ స్వయంగా కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తారు. దానికి ముందు ఉదయం 4 గంటలకు యాగం నిర్వహించనున్నారు. ఏక కాలంలో కొండ పోచమ్మ దేవాలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కూక్) వద్ద సుదర్శన యాగం ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు సిఎం కెసిఆర్‌ దంపతులు.. ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/