తెలుగు తమ్ముళ్లకు అండగా ఉంటా అంటూ మంత్రి పొంగులేటి హామీ

టీడీపీ, కాంగ్రెస్ కలిసిన తరువాత వార్ వన్ సైడ్ అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తెలుగు తమ్ముళ్లకు అండగా ఉంటానని, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదనేసంగతి తెలిసిందే. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపింది. ముఖ్యంగా టీడీపీ కి అడ్డాగా ఉండే ఖమ్మంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పొంగులేటి , తుమ్మలకు సపోర్ట్ చేసి వారిని గెలిపించారు. ఇక ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో అలాగే సపోర్ట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘు రామసహాయం గెలుపుకు కృషి చేస్తున్నారు.