సిఎం జగన్‌ను కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ

కాంగ్రెస్ లోకి షర్మిల చేరికపై చర్చించినట్టు సమాచారం

Ponguleti Srinivas Reddy meets CM Jagan

అమరావతిః ఏపి సిఎం జగన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంతో భేటీ అయ్యారు. ఏపీ సీఎంతో పొంగులేటి భేటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. మరోవైపు ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.