అవివాహితుల‌కు పెన్ష‌న్: హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్

Haryana announces monthly pension for unmarried people, widowers

చండీఘ‌డ్‌: హ‌ర్యానా ప్ర‌భుత్వం అవివాహితుల కోసం పెన్ష‌న్ స్కీమ్‌ను ప్ర‌క‌టించింది. పెళ్లి కాని ఆడ‌వాళ్ల‌కు, మ‌గవాళ్ల‌కు ప్ర‌తి నెలా రూ.2,750 ఇవ్వ‌నున్న‌ట్లు సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టార్ తెలిపారు. 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారికి ఈ పెన్ష‌న్ వ‌ర్తించ‌నున్న‌ది. అయితే అవివాహిత పెన్ష‌న్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 ల‌క్ష‌ల‌కు త‌క్కువ‌గా ఉండాల‌ని సీఎం వెల్ల‌డించారు. వితంతువుల‌కు కూడా ఆయ‌న పెన్ష‌న్‌ను ప్ర‌క‌టించారు. 40 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య ఉన్న వితంతువుల‌కు ప్ర‌తినెలా రూ.2750 ఇవ్వ‌నున్నారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 ల‌క్ష‌ల లోపు ఉండాలి.