YSRTP లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..?

Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..YSRTP లో చేరతానని మాట ఇచ్చినట్లు పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల తెలిపారు. గత కొద్దీ రోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ ను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడుతున్నట్లు ఇప్పటికే అందరికి అర్థమైంది. కానీ ఇప్పుడు ఏ పార్టీ లో చేరతారనేది ఇంట్రస్టింగ్ గా మారింది. కొంతమంది బిజెపి లో అని , మరికొంతమంది కాంగ్రెస్ లో చేరతారని అంటున్నారు. మరోపక్క శ్రీనన్న మాత్రం ఆత్మీయ సమ్మేళనం పెరిగే భారీ సభలు , సమావేశాలు నిర్వహిస్తూ తన అభిమానులను కలుస్తున్నారు.

ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి YSRTP లో చేరతానని మాట ఇచ్చినట్లు పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల తెలిపి షాక్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరతానని తనకు హామీ ఇచ్చారని, మిగతా విషయాలు ఆయన్నే అడగాలని షర్మిల చెప్పారు. ఏ సమయంలో ఏది జరగాలో అది జరుగుతుందన్నారు షర్మిల. దీంతో పొంగులేటి షర్మిల పార్టీలో చేరడం దాదాపు ఖాయమై పోయినట్టేనని తెలుస్తోంది. కాగా కొద్దిరోజుల క్రితమే పొంగులేటి షర్మిలతో భేటీ అయ్యారు.