భారత్‌లో మరో 1543 కరోనా కేసులు

ముఫ్పై వేలకు చేరవయిన కేసులు, పెరుగుతున్న కోలుకుంటున్న వారిశాతం.

corona patient
corona patient

న్యూఢిల్లీ: భారత్‌ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా మరో 1,543 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. గడచిన 24 గంటలలో కరోనా కారణంగా 62 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు దీని బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 934 కు చేరింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 29,435 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 6,869 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. భారత్‌లో కరోనా నుంచి కోలుకున్న వారి శాతం కూడా రోజరోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం కోలుకుంటున్న వారిశాతం 23.33 గా ఉంది. కాగా దేశంలో ప్రస్తుతం 21,632 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ ఇప్పటివరకు 8,590 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 369 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్‌ కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు 1177 కరోనా కేసులు నమోదుఅయ్యాయి. ఇక తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది ఒక్కరోజు మొత్తంలో కేవలం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు అయి కేసుల సంఖ్య 1004 కు చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/