మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర వాసులు

బిఆర్ఎస్ పార్టీని దేశ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. రీసెంట్ గా ఖమ్మం లో తొలి సభ నిర్వహించడం..ఆ సభ భారీ సక్సెస్ కావడం తో ఇతర చోట్ల ఫై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 05 న మహారాష్ట్రలోని నాందేడ్‌లో భారీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభ ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలనీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కార్య కర్తలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో పలువురు మహారాష్ట్ర వాసులు బీఆర్‌ఎస్‌లో చేరారు. గురువారం బోకర్ తాలుకా రాఠీ సర్పంచ్ మల్లేశ్‌తో పాటు మరో వందమంది బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి బీఆర్‌ఎస్ నాయకుడు బామిని రాజన్న ఆధ్వర్యంలో మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భాంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకు అందజేయాలని కోరుతూ అనేక మంది నాయకులు, స్థానికులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఫిబ్రవరి 5న నాందేడ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సర్పంచ్ మల్లేశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ చేరామని పేర్కొన్నారు.