అన్న క్యాంటీన్లఫై కీలక ప్రకటన చేసిన నందమూరి బాలకృష్ణ

అన్న క్యాంటీన్లఫై కీలక ప్రకటన చేసారు హిందూపురం ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆదివారం గుంటూరులోని జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. పేద‌వాడి ఆక‌లి తీర్చాల‌న్న టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ ఆశ‌యం ఆధారంగా ఏర్పాటైన అన్న క్యాంటీన్ల‌ను తెలుగు ప్ర‌జ‌ల స‌హకారంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏర్పాట‌వుతాయ‌ని ప్ర‌క‌టించారు.

ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గ‌తంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయ‌ని ఆయ‌న‌ తెలిపారు. రాజ‌కీయ ఉద్దేశంతోనే వైసీపీ స‌ర్కారు అన్న క్యాంటీన్ల‌ను ర‌ద్దు చేసిందని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌భుత్వ దుర్మార్గాలు ప్ర‌జ‌ల పాలిట శాపాలుగా మారాయని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం రూ.8 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసిందన్న బాల‌య్య‌.. దాని ప్ర‌భావ‌మే ప్ర‌జ‌ల‌పై ప‌న్నుల బాదుడే బాదుడు అని ఆరోపించారు.