వైసీపీలో వరుసగా పడుతున్న వికెట్లు

ఏపీ అధికార పార్టీ వైస్సార్సీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. మరో మూడు నెలల్లో ఎన్నికల రాబోతున్న సమయంలో వైసీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైస్సార్సీపీ..ఈ ఎన్నికల్లో కూడా 175 కు 175 సాదించాలని సలహాలు చేస్తుంది. ఈ క్రమంలో పార్టీలో కీలక మార్పులు చేస్తూ సెట్టింగ్ ఎమ్మెల్యేలకు అధినేత జగన్ షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాలలో సదరు ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా.. వారికి ఈసారి టికెట్స్ కేటాయించడం లేదు. వారి స్థానాలలో కొత్త వారికీ టికెట్ ఇస్తున్నట్లు తెలుపుతూ.. ఇదే విషయాన్ని సదరు నేతలకు చెబుతూ ఉండడంతో వారంతా వరుసగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీలలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామాలు చేసి జనసేన, టిడిపి పార్టీలలో చేరగా..మరికొంతమంది వీరి బాటలోనే నడవబోతున్నారు.

తాజాగా మరో వికెట్ వైసీపీ కోల్పోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ గుడ్డిగా నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. సర్వేల పేరుతో తనకు టికెట్ లేకుండా చేశారని మీడియా ముందు వాపోయాడు. జగన్ కోసం కాంగ్రెస్ పార్టీని, మంత్రి పదవిని వదులుకొని వైసీపీలో చేరానని గతంలో మంత్రి పదవి ఇస్తానని ఇవ్వకుండా చేశారని ఇప్పుడు సర్వే పేరుతో నాకు టికెట్ లేదని చెప్పడం ఎంతవరకు న్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేసాడు. జగన్ టికెట్ ఇవ్వకపోయినా టికెట్ ఇచ్చే పార్టీలలో చేరుతానని.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారని రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాయదుర్గం నుంచి ఎవరికి టికెట్ ఇస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంది. అయితే బయట ప్రచారం బట్టి గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన మెట్టు గోవిందరెడ్డికి ఈసారి రాయదుర్గం టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది మరి ఎవరికి ఇస్తారు చూడాలి.