సోనూ సూద్ ను అడ్డుకున్న అధికారులు: కారు సీజ్

Sonu Sood car seized
Sonu Sood car seized

నటుడు సోనూ సూద్‌ మొగా జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఆయన సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ టికెట్‌పై మోగా నుంచి పోటీ చేస్తున్నారు. సోనూసూద్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని  దీనిపై అకాలీదళ్‌ ఫిర్యాదు చేసింది.

సోనూ సూద్ కారు సీజ్

పంజాబ్‌లోని మోగాలో నటుడు సోనూ సూద్ కారును సీజ్ చేశారు. జిల్లా పీఆర్వో ప్రభదీప్ సింగ్ మాట్లాదారు. .సోనూ సూద్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అయన కారును సీజ్ చేసి.. సోనూ సూద్‌ను ఇంటికి పంపించటం జరిగిందని తెలిపారు . ఇంటి నుంచి ఆయన బయటకు వస్తే కేసులు పెడతామని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/