పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభ ఈరోజు మచిలీపట్నం శివారులో భారీ ఎత్తున జరగబోతుంది. ఈ క్రమంలో జనసేనాధినేత పవన్ మధ్యాహ్నం విజయవాడ నుండి తన వారాహి వాహనం తో బయలుదేరనున్నారు. కాగా పవన్ వారాహి ర్యాలీ లో పోలీసులు స్వల్ప మార్పులు చేసారు. షెడ్యూల్ ప్రకారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో పవన్ రావాల్సి ఉంది. అయితే, అసెంట్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కానున్న తరుణంలో గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీకి రావాల్సి ఉంది. దీంతో వారి వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని, వారాహి ప్రయాణంలో మార్పు చేసుకోవాలని జనసేనకు పోలీసులు సూచించారు. దీంతో, పోలీసుల సూచన మేరకు జనసేన హైకమాండ్ వారాహి యాత్రలో స్వల్ప మార్పులు చేసింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతం నుంచి పవన్ వారాహిలో బయల్దేరనున్నారు.

అలాగే సభ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు పోలీసులు. జిల్లా పోలీస్ యంత్రాంగం 400 మంది పోలీసులు, మహిళా పోలీసులు పహారా ఉంటుందని తెలిపారు. సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుందని , బైక్ ర్యాలీలు నిషేధం అని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అందుబాటులో రెండు అంబులెన్సులు,రెండు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసామని..ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా ప్రశాంతంగా సభ జరుపుకోవాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ఎస్పీ పి జాషువా.