హ‌ర్యానాలో న‌లుగురు ఉగ్ర‌వాదుల అరెస్ట్‌

హ‌ర్యానా: హ‌ర్యానాలోని క‌ర్నాల్ ప్రాంతంలో న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ద‌గ్గ‌రి నుంచి పెద్ద మొత్తంలో బుల్లెట్లు, గ‌న్ పౌడ‌ర్‌, ఆర్డీఎక్స్‌ను హ‌ర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వ‌ద్ద నుంచి ఇంత పెద్ద మొత్తంలో బుల్లెట్లు, ఇత‌ర‌త్రా పేలుడు సామాగ్రి దొర‌క‌డంతో పోలీసులు అల‌ర్ట్ అయ్యారు. ఈ న‌లుగురు కూడా పంజాబ్ ఉగ్ర‌వాద సంస్థ అయిన బ‌బ్బ‌ర్ ఖాల్సా ఇంట‌ర్నేష‌న‌ల్ (బీకేఐ) సంస్థ‌కు చెందిన‌వారుగా పోలీసులు పేర్కొంటున్నారు. వీరిని ప‌ట్టుకోడానికి పంజాబ్ ఐబీ పోలీసులు, హ‌ర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఆప‌రేష‌న్‌ను నిర్వ‌హించారు.

ఈ న‌లుగురు అనుమానిత ఉగ్ర‌వాదుల వ‌య‌స్సు 20 నుంచి 25 సంవ‌త్స‌రాల మ‌ధ్యే వుంద‌ని పోలీసులు పేర్కొంటున్నారు. వీళ్లు పంజాబ్ నుంచి నాందేడ్ బ‌య‌ల్దేరుతుండ‌గా ప‌ట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. హ‌ర్యానాలోని బ‌స్తాడా టోల్ ప్లాజా వ‌ద్ద పోలీసులు ఓ ఇన్నోవాను ఆపి, త‌నిఖీ చేస్తుండ‌గా… వీళ్లు దొరికిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/